Viral News: ఇంట్లో ఉండేందుకు కూతురిని అద్దె కట్టమన్న తల్లి.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్.!

ఇంట్లో ఉండేందుకు పిల్లల నుంచి తల్లిదండ్రులు అద్దెను వసూలు చేయడం మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ స్టోరీ చదవండి...

Viral News: ఇంట్లో ఉండేందుకు కూతురిని అద్దె కట్టమన్న తల్లి.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్.!
House
Follow us

|

Updated on: Nov 17, 2021 | 9:27 PM

ఇంట్లో ఉండేందుకు పిల్లల నుంచి తల్లిదండ్రులు అద్దెను వసూలు చేయడం మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ స్టోరీ చదవండి. మీరు షాక్ కావడం గ్యారంటీ.! ఇలాంటి వింత సంఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసుకుంది. ఇంట్లో ఉండాలంటే అద్దె కట్టాలంటూ సొంత కూతురుకు ఓ తల్లి కండిషన్ పెట్టింది. ఇక ఆ కండిషన్ వెనుక ఉన్న ఆసక్తికరమైన పరిణామం ఏంటన్నది ఆ తల్లి వివరించగా.. అది విని నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

క్యాట్ క్లార్క్ అనే మహిళ తన కూతురు దగ్గర నుంచి ప్రతీ నెలా అద్దె వసూలు చేస్తోంది. అదెందుకో ఆమె టిక్‌టాక్ ద్వారా నెటిజన్లకు వివరించింది. ఓ వీడియో చేసిన ఆమె.. అందులో తన కూతురుతో ఓ గేమ్ ఆడింది. ఇందులో ఓడిపోయినవారు.. గెలిచినవారు చెప్పింది చెయ్యాలి. ఇక ఈ ఆటలో ఆమె కూతురు లతీషా ఓడిపోతుంది. దీనితో క్యాట్ క్లార్క్.. కూతురుకు ఓ కండిషన్ పెడుతుంది. అదేంటంటే.. రాబోయే ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఉండేందుకు తన కూతురును అద్దె చెల్లించాలని చెబుతుంది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వరుసపెట్టి నెటిజన్ల నుంచి కామెంట్స్ వస్తున్నాయి.

కొంతమంది దగ్గర నుంచి క్యాట్ క్లార్క్ విమర్శలు ఎదుర్కుంది. అయితే వాటిని తాను పెద్దగా పట్టించుకోనని తెలియజేస్తూ.. తన కూతురిని ప్రతీ నెలా రూ. 2600(ఇండియా కరెన్సీలో) చెల్లించమని చెప్పినట్లుగా వివరిస్తుంది. కాగా, ఈ కండిషన్‌ను ఉద్దేశపూర్వకంగా పెట్టలేదని.. తన కూతురికి చక్కటి జీవితాన్ని అందించడంలో ఇది సహాయపడుతుందని.. ఈ డబ్బును దాచిపెట్టి.. ఆమె కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు దీన్ని అందిస్తానని క్యాట్ క్లార్క్ పేర్కొంది.