Woman Charges Rent: కూతురి దగ్గర అద్దె వసూలు చేస్తున్న తల్లి..! కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Woman Charges Rent: తల్లిదండ్రులు సొంత పిల్లల దగ్గర అద్దె వసూలు చేయడం ఎప్పుడైనా చూశారా? ఇది వింతగా అనిపిస్తుంది కదూ.. కానీ న్యూజిలాండ్‌లో సరిగ్గా

Woman Charges Rent: కూతురి దగ్గర అద్దె వసూలు చేస్తున్న తల్లి..! కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Woman Charges Rent
Follow us

|

Updated on: Nov 17, 2021 | 5:53 AM

Woman Charges Rent: తల్లిదండ్రులు సొంత పిల్లల దగ్గర అద్దె వసూలు చేయడం ఎప్పుడైనా చూశారా? ఇది వింతగా అనిపిస్తుంది కదూ.. కానీ న్యూజిలాండ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. ఇక్కడ ఒక తల్లి తన సొంత కూతురి నుంచి ప్రతి నెల అద్దె వసూలు చేస్తుంది. క్యాట్ క్లార్క్ అనే మహిళ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. Kat Clarke Tiktokలో ఒక వీడియోని షేర్ చేసింది. ఇందులో ఆమె తన కూతురితో గేమ్ ఆడుతూ కనిపించింది. ఈ ఆటలో ఒక పెన్ను కప్పులో పెట్టాలి. ఈ ఆటలో ఎవరు గెలిస్తారో వారు చెప్పినట్లు అవతలి వ్యక్తి వినాలి. క్యాట్ తన కూతురు లతీషాతో కలిసి ఈ గేమ్ ఆడుతుంది. ఈ గేమ్‌లో లతీషా తన తల్లి చేతిలో ఓడిపోతుంది. అప్పుడు Kat Clarke తన కుమార్తె ముందు ఒక షరతు పెడుతుంది.

క్యాట్ తన కుమార్తె లతీషాతో రాబోయే ఒక సంవత్సరం ఇంట్లో ఉండటానికి అద్దె చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. క్యాట్ ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు ప్రపంచం నలుమూలల నుంచి ఆమె నిర్ణయంపై కామెంట్‌ చేశారు. సొంత కూతురి నుంచి అద్దె వసూలు చేసినందుకు చాలా మంది క్యాట్‌ను తిడుతున్నారు. అయితే ప్రజల తిట్లను తాను పట్టించుకోనని చెప్పింది. ప్రతి నెలా రూ. 2600 అద్దె చెల్లించమని క్యాట్ కూతురిని ఆదేశిస్తుంది. అయితే క్యాట్ దీని వెనుక ఒక కారణముందని చెప్పింది. ఇది ఒక రకమైన పెట్టుబడి లాంటిదని పేర్కొంది. తన కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కొత్త ఇల్లు కొనడానికి ఆమెకు ఈ డబ్బును అందిస్తానని తెలియజేసింది. ఈ విధంగా తన కూతురికి విజయవంతమైన జీవితాన్ని అందించాలనుకుంటున్నట్లు క్యాట్ వివరించింది. నిజానికి ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా లభించదని క్యాట్ నమ్ముతుంది.

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్‌.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..

పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?

AP IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..?