Viral: పెన్షన్ డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చెక్ చేయగా షాక్

తాజాగా గవర్నమెంట్ వేసిన పింఛన్ డబ్బు తీసుకునేందుకు ఓ వృద్ధుడు బ్యాంకుకు వెళ్లాడు. అనంతరం బ్యాలెన్స్ చెక్ చేయించగా అతడి ఖాతాలో ఉన్న సొమ్ము చూసి బ్యాంకు అధికారులే నిర్ఘాంతపోయారు.

Viral: పెన్షన్ డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చెక్ చేయగా షాక్
Rs 52 Crore In Pension Account
Follow us

|

Updated on: Jan 13, 2022 | 8:20 AM

అతడు నిరుపేద వృద్ధుడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుతో జీవితాన్ని నెట్టికెళ్లిపోతున్నాడు. తాజాగా గవర్నమెంట్ వేసిన పింఛన్ డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. అనంతరం బ్యాలెన్స్ చెక్ చేయించగా అతడి ఖాతాలో ఉన్న సొమ్ము చూసి బ్యాంకు అధికారులే నిర్ఘాంతపోయారు. వృద్ధుడి పింఛను ఖాతాలో సుమారు రూ.75 కోట్లపైనే జమ అయ్యాయి.  ఈ విషయం తెలియడంతో ఆ ఆ వృద్ధుడు సైతం షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లా, జార్ముండి మండలం.. సాగర్‌ గ్రామంలో కుమారుడు, భార్యతో కలిసి ఫూలోరాయ్‌ అనే వ్యక్తి ఓ చిన్న పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. అక్కడే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో అతనికి పెన్షన్ అకౌంట్ ఉంది. ఇటీవల అవసరాల కోసం పింఛను డబ్బులు తీసుకోవడానికి ఫూలోరాయ్‌.. దగ్గర్లోని రూరల్‌ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లాడు. రూ.10,000 తీసుకున్నాడు. పనిలో పనిగా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయించాడు.  ఖాతాలో రూ.75.28 కోట్ల డబ్బు ఉందని బ్యాంకు అధికారులు చెప్పడంతో అవాక్కయ్యాడు.

ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదని వెల్లడించాడు. దీనిపై రెస్పాండ్ అయిన బ్యాంకు అధికారులు.. ఫూలోరాయ్‌ ఖాతాలోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ చేస్తామన్నారు. టెక్నికల్ ఎర్రర్స్ కారణంగా ఇలా జరిగే అవకాశముందన్నారు.

Also Read: పెళ్లి కావడం లేదన్న మనస్తాపం.. అమ్మ ఉంటే ఇలా అయ్యేది కాదంటూ యువకుడు సూసైడ్

నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్