Viral Video: వివాహ వేదిక ఎక్కుతుండగా ఇబ్బందిపడిన పెళ్లి కూతురు.. వెంటనే స్పందించిన వరుడు.. నెటిజన్లు ఫిదా..

Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో కూడా పెళ్లిళ్ల వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజలు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో..

Viral Video: వివాహ వేదిక ఎక్కుతుండగా ఇబ్బందిపడిన పెళ్లి కూతురు.. వెంటనే స్పందించిన వరుడు.. నెటిజన్లు ఫిదా..
Viral Video
Follow us

|

Updated on: Nov 25, 2021 | 9:39 PM

Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో కూడా పెళ్లిళ్ల వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజలు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేస్తున్న వివాహాల ఫన్నీ వీడియోలను అదరిస్తున్నారు. వీటిలో కొన్ని వీడియోలు చూసి జనాలు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొందరు కొన్ని వీడియోలనను చూసి కూడా ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో.. కొన్ని వీడియోలు ప్రజల హృదయాలను తాకుతున్నాయి. తాజాగా పెళ్లికి సంబంధించిన మరో వధూవరుల ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి పీటలమీదకు వస్తున్న వధువుకు ఏదో జరిగింది.. అది గమనించిన వరుడు అకస్మాత్తుగా అద్భుతమైన పని చేసి ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. దీంతో ఈ వీడియోను ప్రజల చాలా ఇష్టపడుతున్నారు.

పెళ్లిలో అందంగా, డిఫరెంట్ గా కనిపించేలా ప్రతి జంట ముందుగా సన్నాహాలు చేసుకుంటుంది. బట్టల దగ్గరి నుంచి మేకప్ వరకు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే వధూవరులు పెళ్లి వేదికపైకి ఎక్కుతున్న నమయంలో వధువు లెహంగా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని వరుడు గమనించాడు. వెంటనే స్పందించాడు. వధువుకు సహాయం చేస్తూ.. లెహంగాను హ్యాండిల్ చేస్తూ చేతితో సరిచేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో సోషల్ మీడియా లో ‘witty_wedding’ పేరుతో ఉన్న ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. విపరీతంగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ‘ఇది చాలా మనోహరమైన క్షణం’ ఒకరు, ‘సో క్యూట్’ ఎంత మనోహరమైన దృశ్యం ‘, అమ్మాయి చాలా అదృష్టవంతురాలు’ డిఫరెంట్ గా కామెంట్స్ చేస్తూ.. వరుడు చేసిన పనికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  వివాహం ఆలస్యం అవుతుందా. అయితే వివాహ పంచమి వ్రతం ఆచరించండి.. ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందంటే..