Viral Video: ఇంటిలో నుంచి వింత శబ్దాలు.. ఏంటని చూడగా గుండె గుభేల్! ధైర్యముంటేనే చూడండి..

సాధారణంగా చాలామందికి పాములంటే చచ్చేంత భయం. వాటిని దగ్గరగా చూడాలని అస్సలు అనుకోరు. అలాంటిది దాన్ని పట్టుకోవాలంటే..

Viral Video: ఇంటిలో నుంచి వింత శబ్దాలు.. ఏంటని చూడగా గుండె గుభేల్! ధైర్యముంటేనే చూడండి..
Viral Video
Follow us

|

Updated on: Aug 25, 2022 | 12:05 PM

సాధారణంగా చాలామందికి పాములంటే చచ్చేంత భయం. వాటిని దగ్గరగా చూడాలని అస్సలు అనుకోరు. అయితే అత్యంత ప్రమాదకరమైన పాము ఒకటి నేరుగా కనిపిస్తే.. అప్పుడేంటి సంగతులు! ఏముంది గుండె జారిపోయినట్లే. అవునండీ! ‘క్రైట్ స్నేక్‌’ అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో ఈ పాము కాటు వల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే దీన్ని పట్టుకునేటప్పుడు స్నేక్ క్యాచర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే ఇక్కడొక స్నేక్ క్యాచర్ ఇలాంటి రెండు పాములను చాకచక్యంగా పట్టుకున్నాడు. అదేంటో మీరూ చూసేయండి..

వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని ఓ ఇంటిలోకి అత్యంత విషపూరితమైన రెండు క్రైట్ స్నేక్‌‌లు దూరాయి. ఓ రూమ్‌లో నుంచి వింత శబ్దాలు రావడాన్ని గమనించిన ఇంట్లోని వారు.. వెళ్లి చూడగా.. ఈ రెండు పాములు కనిపించాయి. వెంటనే స్నేక్ క్యాచర్ మురళీవాలేకి సమాచారాన్ని అందించారు. స్పాట్‌కు చేరుకున్న అతడు మొదటిగా ఒక దాన్ని పట్టుకుని బంధించాలనుకున్నాడు. అయితే అది అతడికి సాధ్యపడలేదు. అందుకే రెండింటిని ఒక దగ్గరకు తీసుకొచ్చి పట్టుకోవాలని ప్రయత్నించాడు. మొదటి ప్రయత్నంలో అతడు విఫలం కాగా.. రెండో ప్రయత్నంలో స్టిక్ సాయంతో సఫలం అయ్యాడు. రెండింటి తోకలను పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. అనంతరం ఓ సంచిలో వేసి క్లోజ్ చేసేశాడు. ఆ తర్వాత అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ దానిపై ఓ లుక్కేయండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..