Viral Video: వామ్మో దీని జంపింగ్స్ అదుర్స్.. పెంగ్విన్ సరదా నడకను చూశారా..

పెంగ్విన్ నడుస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది.. మన ఇంట్లో బొద్దుగా.. ముద్దుగా ఉండే చిన్నారుల నడకను కాపీ చేసినట్లుగా ఉంటుంది వాటి నడక అయితే..

Viral Video: వామ్మో దీని జంపింగ్స్ అదుర్స్.. పెంగ్విన్ సరదా నడకను చూశారా..
Penguin Swinging
Follow us

|

Updated on: Jan 18, 2022 | 10:11 AM

పెంగ్విన్ నడుస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది.. మన ఇంట్లో బొద్దుగా.. ముద్దుగా ఉండే చిన్నారుల నడకను కాపీ చేసినట్లుగా ఉంటుంది వాటి నడక అయితే.. అయితే ఇవాళ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెంగ్విన్ నడక నెటిజన్లను నవ్వులు పూయించింది. ఆ పెంగ్విన్‌ని మీరు చూస్తే అదే అంటారు.. అయితే.. పెంగ్విన్ ఎగరదు, నీటిలో తేలుతుంది. ఇవి 900 అడుగుల లోతు వరకు నీటిలో సులభంగా ఈదగలవు.. అదే సమయంలో అవి దాదాపు 20 నిమిషాల పాటు శ్వాసను కూడా బిగబట్టి ఉండగలవు. వాటి జీవితంలో సగానికి పైగా నీటిలోనే గడిచిపోతుంది. ఇది సాధారణంగా మంచు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇతర ప్రదేశాలలో అరుదుగా కనిపిస్తుంది.

అయితే, ఇవాళ సోషల్ మీడియాలో ఈ బెజ్జి పెంగ్విన్ నడక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాని నడక చూసిన మరికొన్ని పెంగ్విన్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాయి. దాని ఫన్నీ నడకకు మీరు చూసినా అదే అంటారు.  అందులో పెంగ్విన్ సరదాగా జంప్ చేస్తూ కనిపించింది. ఈ బుజ్జి పెంగ్విన్‌ను చూస్తుంటే లోకంలోని బాధలన్నీ తీరి ఆనందిస్తున్నట్లు అనిపిస్తుంది.

ఈ ఫన్నీ వీడియోను IAS అధికారి డా. MV రావు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.. అంతేకాదు అదేస్థాయిలో లైక్స్ కూడా పెరిగి పోతున్నాయి.

ఇవి కూడా చదవండి: Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..

ఇప్పుడు మీ ఫోన్ వాకీ టాకీ మార్చుకోవచ్చు.. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..