VIRAL VIDEO : ఈ రోజుల్లో ప్రజలు వేరు వేరు అభిరుచులను కలిగి ఉన్నారు. అందుకోసం వేర్వేరు పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు వారి జీవితాలు ప్రమాదంలో పడతాయి. అయినా కూడా వారిలో మార్పు రాదు. సోషల్ మీడియాలో ఇలాంటి వారి వీడియోలు చాలా ఉన్నాయి. నిత్యం ఇవి వైరల్గా మారుతుంటాయి. కొంతమంది ఈ రకమైన వీడియోలను చాలా ఇష్టపడతారు, మరికొందరు ఈ వీడియోలను చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఈ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.
ఈ వీడియోలో కొంతమంది మహిళలు ఫోటో దిగడానికి వాటర్ పాల్ దగ్గరకు వచ్చారు. సాధారణ ప్రజలు ఇక్కడికి వెళ్ళడానికి భయపడతారు. అయితే ఆ మహిళలకు ఏమి జరిగిందో చూస్తే మీరు కూడా ‘షాక్ అవుతారు’. యువతకు ఫొటోలు, సెల్పీలంటే ఒక పిచ్చి. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లి మరీ ఫొటో షూట్ చేస్తారు. ఈ వీడియో చూసిన తరువాత చాలా మంది ఇలా చేయడం మానుకోవాలి.
వీడియోలో ఈ మహిళలను చూడండి ఫొటో తీయడానికి జలపాతం దగ్గరకు పడవలో చేరుకొని అందరు కలిసి స్టిల్ ఇవ్వడానికి ఒకే వైపుకు చేరుకోవడంతో పడవ అదుపతప్పుతుంది. దీంతో అందరు జలపాతంలో పడిపోతారు. వీడియో చూసినప్పుడు మీరు కూడా ఒక క్షణం ఆశ్చర్యపడి ఉండాలి. అదే సమయంలో మీరు ఆలోచన చేస్తూ ఉండాలి. ఈ ఫన్నీ వీడియోను Twitter HldMy Beer అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పటివరకు 80 వేలకు పైగా ప్రజలు ఈ వీడియోను చూశారు. అదే సమయంలో ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూసిన మహిళలు బండ బూతులు తిడుతున్నారు.
Say cheese! 📸 🍺 pic.twitter.com/zAl3K5pKLN
— 🍺 Hold My Beer 🍺 (@HldMyBeer) July 3, 2021