Viral Video: అరేయ్ ఏంట్రా ఇది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్.. ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ట్రక్ డ్రైవర్ వీడియో..

Viral Video: కొందరు డ్రైవర్లు తమ వాహనాన్ని అత్యంత వేగంగా, దురుసుగా నడుపడం అనేక సందర్భాల్లో మనం చూశాం.

Viral Video: అరేయ్ ఏంట్రా ఇది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్.. ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ట్రక్ డ్రైవర్ వీడియో..
Driver
Follow us

|

Updated on: Mar 03, 2022 | 7:39 AM

Viral Video: కొందరు డ్రైవర్లు తమ వాహనాన్ని అత్యంత వేగంగా, దురుసుగా నడుపడం అనేక సందర్భాల్లో మనం చూశాం. అలా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన ఘటనలూ ఉన్నాయి. దందుడుకు డ్రైవింగ్‌తో వారి ప్రాణాలు మాత్రమే కాకుండా.. అమాయకుల ప్రాణాలు సైతం ప్రమాదంలో పడేస్తుంటారు. కొందరు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే వీడు కూడా కంత్రీగాడి మాదిరిగానే ఉన్నాడే అనే ఫీలింగ్ కలుగుతుంది. అరేయ్ ఇంట్రా ఇది ఆగ్రహం కూడా వస్తుంది. కానీ, అప్పుడే అసలు సిసలైన్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ చూస్తే అప్పటి వరకు వచ్చిన కోపం, టెన్షన్ అంతాపోయి.. ఓరి నీ ఏశాలో అని అనిపిస్తుంది.

గత కొన్నేళ్లుగా వీడియో షేరింగ్ యాప్స్ క్రేజ్ బాగా పెరుగుతూ వస్తోంది. వీడియో చేయడం.. వాటిలో షేర్ చేయడం రాత్రి రాత్రే ఫేమస్ అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు చాలా మంది. తాజాగా ఓ లారీ డ్రైవర్ కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. ఆ వీడియో మొదట్లో తన ప్రాణాలతో పాటు.. లారీలో ఉన్న మరికొందరి ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టి షాకింగ్ ఫీట్స్ చేస్తున్నట్లుగానే ఉంటుంది. మఆ వీడియోలో లారీ వేగంగా నడుస్తున్నట్లు కనిపిస్తుంటుంది. ఇంతలో డ్రైవర్ లారీ స్టీరింగ్‌ని వదిలిపెట్టాడు. పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా డ్రైవింగ్ సీట్ నుంచి పక్కకు తప్పుకున్నాడు. డోర్ వద్ద నిల్చుని రకరకాల విన్యాసాలు చేశాడు. భయానకమైన ఫీట్స్ చేశాడు. ఆ డ్రైవర్ ఫీట్స్‌ని.. లారీలో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. అనంతరం డ్రైవర్ ఆఫోన్ తీసుకుని కెమెరాను ముందువైపు తిప్పాడు. అప్పుడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. లారీ అసలు నడవడం కాదు కదా? కనీసం ఇంజిన్ కూడా ఆన్‌లో లేదని తేలిపోతుంది. కొన్ని ట్రక్కులను గూడ్స్ రైలులో తరలిస్తున్నాడు. ఆ వాహనాల్లో ఇది ఒకటి. అప్పటి వరకు తానేదో ఫీట్స్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి.. చివరకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ఆ ఫన్నీ డ్రైవర్. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మొత్తానికి ఈ వీడియోను ఇప్పటి వరకు 59 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by memes | comedy (@ghantaa)

Also read:

News Watch: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు 15 కోట్ల డీల్ మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్.. వీడియో

Mega-Yacht Seize: ఉక్రెయిన్ లో రెచ్చిపోతున్న రష్యాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జర్మనీ.. పూర్తి వివరాలు

Lahari Shari: అప్పుడు లగ్జరీ బైక్‌.. ఇప్పుడేమో ఖరీదైన కారు.. లహరి స్పీడు మాములుగా లేదుగా.. కొత్త కారు ధరెంతో తెలుసా?