Viral Video: టెర్రిఫిక్ సీన్.. రెండు పెద్ద పులుల మధ్య భీకరపోరు.. వీడియో చూస్తే హడలిపోతారు..!

Viral Video: చిన్న చిన్న జంతువులు ఆడుకుంటుంటే చూడటానికి సరదాగా ఉంటుంది. అంటే, ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల

Viral Video: టెర్రిఫిక్ సీన్.. రెండు పెద్ద పులుల మధ్య భీకరపోరు.. వీడియో చూస్తే హడలిపోతారు..!
Tiger Fights
Follow us

|

Updated on: Jun 15, 2022 | 7:00 AM

Viral Video: చిన్న చిన్న జంతువులు ఆడుకుంటుంటే చూడటానికి సరదాగా ఉంటుంది. అంటే, ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల మధ్య పొరు ఆసక్తికరంగా ఉంటుంది. అవి సరదాగానే కొట్టుకోవడం, దోబుచులాడుకోవడం చేస్తుంటాయి. పెంపుడు జంతువులే కాదు.. అడవి జంతువులు కూడా ఒకదానికొకటి ఆడుకుంటాయి. ప్రతి జంతువు పిల్లలు సరదాగా కాలక్షేపం చేస్తాయి. అయితే, రెండు పెద్ద పులులు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? ఒకదానిపై మరొకటి భీకర స్థాయిలో పంజా విసురుకోవడం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. గుండె గుభేల్ అనిపించేలా ఉన్న పులులు ఫైటింగ్‌ దృశ్యాలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను చూసి సోషల్ మీడియా యూజర్లు షాక్ అవుతున్నారు.

అడవిలో రెండు పెద్ద పులుల మధ్య భీకర ఫైట్ జరిగింది. అదేదో బాక్సింగ్ మాదిరిగా ఒకదానిపై ఒకటి పంజా విసురుకున్నాయి. కొంత దూరం నుంచి వేగంగా దూసుకొచ్చిన రెండు పులులు.. ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి. ఈ దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. అయితే, వాస్తవానికి అవి పోట్లాడుకోవడం లేదు. సహజంగానే జంతువులు ఇలా సరదాగా ఆడుకుంటాయ. ఆ రెండు పులులు కూడా అలాగే ఆడుకుంటున్నాయట. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఐఎస్ఎఫ్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు వీడియోను 1.25 లక్షల మంది వీక్షించగా.. వేలాది లైక్స్ వచ్చాయి.