Dog Attacked Man: దూలతీరింది.. కుక్క దగ్గర వేశాలేస్తే అంతే మరి.. వైరల్ వీడియో

Man Teasing Dog: కొంత మంది చేష్టలు మరి క్రూరంగా ఉంటుంటాయి. వారి సంతోషం కోసం ఎదుటి వారిని వేధిస్తూ.. తెగ ఆనందపడుతుంటారు. మానవత్వం, జాలి చూపించాల్సిన

Dog Attacked Man: దూలతీరింది.. కుక్క దగ్గర వేశాలేస్తే అంతే మరి.. వైరల్ వీడియో
Dog Attacked Man
Follow us

|

Updated on: Jun 25, 2021 | 5:54 AM

Man Teasing Dog: కొంత మంది చేష్టలు మరి క్రూరంగా ఉంటుంటాయి. వారి సంతోషం కోసం ఎదుటి వారిని వేధిస్తూ.. తెగ ఆనందపడుతుంటారు. మానవత్వం, జాలి చూపించాల్సిన జంతువులను కూడా వేధిస్తూ అల్పసంతోషం పొందుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి సీన్ రివర్స్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఆ జంతువులే వేధించిన వారికి గుణపాఠం చెబితే ఎలా ఉంటుందో.. ఈ వీడియో మనకు రుజువుగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా తిక్క కుదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోలో.. ఓ యువకుడు కుక్కకు రొట్టె ముక్క తినిపిస్తున్నాడు. ఆ యువకుడు రెండు రొట్టె ముక్కలను కుక్కకు తినిపిస్తాడు. ఆ తర్వాత సరదాగా కుక్క చెవి లాగుతాడు. అయితే.. ఈ క్రమలోనే.. కుక్క చెవిని మెలేసి మరి లాగడంతో… అకస్మాత్తుగా కుక్కకు కోపం వస్తుంది. దానికి చిర్రెత్తుకొచ్చి.. యువకుడి చేతిని కొరుకుతుంది. దీంతో అతను విలవిలలాడుతూ.. కుక్క నోటి నుంచి చేతిని గుంజుకుంటాడు. అయితే.. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆ యువకుడికి దూలతీరిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వైరల్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ షేర్ చేయగా.. వేలాది మంది చూసి.. కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా జంతువులను వేధిస్తే.. ఇలానే జరుగుతుందని పేర్కొంటున్నారు.

Also Read:

పొడవులో రెండడుగుల వ్యత్యాసం… గిన్నెస్ బుక్ రికార్డులకెక్కిన అరుదైన జంట…

Trouble with Egg: ఒకే ఒక్క గుడ్డు.. ఒకరిని ఆసుపత్రికి.. మరొకర్ని పోలీస్ స్టేషన్ కి చేర్చింది.. ఎలాగంటే..