Viral Video: ఐపీఎస్ అధికారికి లిప్‌స్టిక్ పూసిన కూతురు.. క్యూట్ వీడియో చూసి మురిసిపోతున్న నెటిజన్లు

Little girl puts lipstick on ips father: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా..

Viral Video: ఐపీఎస్ అధికారికి లిప్‌స్టిక్ పూసిన కూతురు.. క్యూట్ వీడియో చూసి మురిసిపోతున్న నెటిజన్లు
Viral Video
Follow us

|

Updated on: Jan 12, 2022 | 1:40 PM

Little girl puts lipstick on ips father: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా కనిపిస్తుంటాయి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బంధుత్వానికి సంబంధించినవి కూడా నిత్యం వైరల్ (Viral Video) అవుతూనే ఉంటాయి. అయితే.. తాజాగా అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తండ్రి, కుమార్తె అనుబంధాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లంతా.. ఇదే ప్రేమంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి తండ్రి, కుమార్తె మధ్య అనుబంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే.. ప్రపంచంలో అత్యంత అందమైన అద్భుతమైనదిగా కనిపిస్తుంది. తాజాగా వారి ప్రేమకు ప్రతిబింబిస్తూ, ఓ తండ్రి, కుమార్తె వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిలో ఒక చిన్నారి (Girl) తన IPS తండ్రి పెదవులపై లిప్‌స్టిక్‌ను పూయడం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్యూట్ వీడియో వేలాది మంది హృదయాలను గెలుచుకుంది.

తమిళనాడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని ఆర్థిక నేరాల విభాగంలో ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి విజయకుమార్ ఈ వీడియోను ట్విట్టర్‌ హ్యాండిలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో విజయ్‌కుమార్ పెదవులపై తన గారలపట్టి లిప్‌స్టిక్‌ పూయడాన్ని మనం చూడవచ్చు. ఆమె దగ్గర చాలా ఇతర మేకప్ వస్తువులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని చిన్నారి తన తండ్రికి ఉపయోగించాలనుకుంటోంది.

వీడియో చూడండి:

ఈ వీడియోతో పాటు, “కుమార్తెలు/పిల్లలు ప్రపంచంలోని అన్ని ఆనందాలను తీసుకువస్తారు. అంటూ ఐపిఎస్ అధికారి క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 2 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. కూతురు, తండ్రి మధ్య సంబంధాన్ని ప్రతిబింభించే ఈ క్యూట్ వీడియో చూసిన జనాలు చాలా సంతోషిస్తున్నారు. ఈ వీడియోపై చాలా మంది క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

Mediterranean Diet: ప్రపంచంలోని అత్యుత్తమ డైట్‌ ఇదే.. ‘మెడిటెరేనియన్‌’ పాటిస్తే యవ్వనంగా ఉండొచ్చు..

Goosebumps Reasons: శరీరంపై వెంట్రుకలు ఎందుకు నిక్కబొడుస్తాయో తెలుసా..? ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి