viral video : సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా విభిన్నమైన, ఆశ్చర్యకరమైన వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా వింత వీడియోలు జంతువులకు సంబంధించినవే కావడం విశేషం. మనుషుల్లాగే చాలా జంతువులు సంతోషాన్ని, దుఃఖాన్ని, భాదను వ్యక్తం చేస్తాయి. కానీ మనుషులను చూడగానే అవి భయంతోనే సిగ్గుతోనో పైకి మాములుగా కనిపిస్తూ ఉంటాయి. జంతువులు పక్షులతో కూడిన ఈ ప్రపంచం వర్ణించలేనిది.. ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి. ఈ ప్రపంచం మనకు మాత్రమే కాదు ఇది జంతువులు, పక్షులది కూడా.. కొన్ని జంతువులు వింత వింత చేష్టలు చేస్తూ ఉంటాయి. తమ చుట్టూ ఎవ్వరు లేనిసమయంలో అవి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి.
అయితే జంతువులు, పక్షులు చేసే ఇలాంటి చర్యలను కెమెరా కళ్లు తరచుగా బంధిస్తాయి.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఈ వైరల్ వీడియోలో నీటిలో రెండు బాతులు మైమరచి నృత్యం చేయడాన్ని చూడవచ్చు. ఈ అందమైన వీడియోలో బాతు మరో బాతుతో కలిసి నృత్యం చేసింది. ఈ రెండు బాతులు విరహ ప్రేమికుల్లా నీటిలో మునుగుతూ తేలుతూ.. కనువిందుగా డ్యాన్స్ చేస్తూ ఈ లోకాన్ని మరిచిపోయాయి. ఈ వైరల్ వీడియోను ఇప్పటికే వేల మంది వీక్షించారు. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ అందమైన మీడియాను మీరూ చూడండి..