VIRAL VIDEO : మరణం మన దరిచేరినపుడు మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఇది మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది. తాజాగా సోషల్మీడియాలో ఒక జింకకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో ఒక జింక నీరు త్రాగడానికి నది ఒడ్డుకు చేరుకుంటుంది. అయితే అక్కడ దానిపై ఒక మొసలి దాడి చేస్తుంది. చాలాసేపు మొసలితో పోరాడిన జింక చివరకు సరస్సు నుంచి బయటపడుతుంది. కాని దానికి తెలియదు దాని మరణం చిరుతపులి రూపంలో ఎదురుగా వస్తుందని. సరస్సు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా చిరుతపులి జింకపైకి దాడి చేస్తుంది.
వీడియోను చూసినప్పుడు చిరుతపులి పొదల చాటున మాటువేసి ఉంటుంది. ఏదో ఒకవిధంగా జింక మొసలి నుంచి తప్పించుకొని బయటికి రాకపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది. అది అనుకున్నట్లుగానే సరస్సు నుంచి బయటపడిన జింక తేరుకోకముందే దానిపై దాడి చేసి చంపేస్తుంది. దానిని తీసుకొని పొదలలోకి వెళుతుంది. దాని పనిని అది పూర్తిచేసింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక్క క్షణం షాక్ అయి ఉండాలి. ఏది ఏమైనా జంతువుల వేట చాలా ప్రమాదకరమైనది. ఒక క్షణం ఆశ్చర్యపోవచ్చు. ఈ వీడియోను క్రుగర్ సైటింగ్స్ అనే వ్యక్తి యూట్యూబ్లో షేర్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 80 లక్షలకు పైగా చూశారు. వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకున్నారు కామెంట్ చేయండి..