యముడు లీవ్ లో ఉన్నాడేమో.. కదులుతున్న రైలులో రీల్ చేస్తూ చెట్టుకు ఢీకొని కిందపడిన యువతి.. షాకింగ్ వీడియో వైరల్

ప్రస్తుతం జనాలకు రీల్స్ పిచ్చి ఎంతగా పెరిగిందంటే.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొండలు, కోనలు, కదులుతున్న వాహనాలపై విచిత్రమైన పద్దతిలో రీల్స్ చిత్రీకరించెంతలా.. తాజాగా కదులుతున్న రైలులో ఓ యూనిక్ రీల్ వీడియోను చిత్రీకరించే ప్రయత్నంలో ఓ అమ్మాయి చెట్టుకు ఢీకొని కిందపడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చుస్తే గూస్‌బంప్స్ రావడం ఖాయం. వీడియోలో అమ్మాయి ప్రమాదకరమైన రీతిలో బయటికి శరీరాన్ని తలని కూడా వంచింది..తలుపు రెయిలింగ్‌ను పట్టుకుంది.

యముడు లీవ్ లో ఉన్నాడేమో.. కదులుతున్న రైలులో రీల్ చేస్తూ చెట్టుకు ఢీకొని కిందపడిన యువతి.. షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2024 | 9:32 PM

శ్రీలంకలోని కొలంబోలో రైలులో ప్రయాణిస్తున్న చైనా యువతి ఆదివారం చెట్టును ఢీకొని పడిపోయింది. ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. ఆ అమ్మాయి రైలు గేటు వద్ద నిలబడి.. తన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు తీయడానికి.. ఒక ప్రత్యేకమైన వీడియోను చిత్రీకరించడానికి బయటికి వంగి ఉంది. అప్పుడు ఆ యువతి చెట్టు కొమ్మకు తగిలి కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయింది. ఈ భయానక సంఘటన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి వారు షాక్ తిన్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో చైనా పర్యాటకురాలు రైలు డోర్ రెయిలింగ్‌ను పట్టుకుని ప్రమాదకరంగా బయటికి వంగి ఉంది. ఈ సమయంలో ఆమె మరొక ఫ్రెండ్ ఆమెను రికార్డ్ చేస్తుంది. అప్పుడు ఆ యువతి రీల్ కోసం ప్రమాదకరమైన పోజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా చెట్టును ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి

స్థానిక మీడియా కథనాల ప్రకారం చైనా అమ్మాయి , ఆమె స్నేహితురాలు శ్రీలంక లోని అందమైన తీరప్రాంతాన్ని చూడటానికి వెల్లవట్టే నుంచి బంబలపిటియా వెళ్ళే రైలులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఒక యువతి తన ప్రాణాలను పణంగా పెట్టి కదులుతున్న రైలు ఫుట్‌బోర్డ్‌పై నిలబడి రీలు తయారు చేయడం ప్రారంభించింది. రైలు కదులుతున్న సమయంలో వచ్చిన చెట్టుపై నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించేలోపే కొమ్మకు ఢీకొని కిందపడింది.

వీడియోను ఇక్కడ చూడండి.

వీడియోలో చూపించిన దృశ్యాలు భయానకంగా ఉన్నప్పటికీ.. యువతి స్వల్ప గాయాలతో అద్భుతంగా బయటపడిందని పోలీసులు మీడియాకు తెలిపారు. యువతి పొదల్లో పడడంతో తలకు బలమైన గాయాలు కాలేదని భావిస్తున్నారు. యువతికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. అయితే ఈ ప్రమదం జరిగిన సంఘటన తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ యువతి ప్రాణాలతో బయటపడడం.. భూమి మీద ఇంకా నూకలు ఉండడమే అని అంటున్నారు. అంతేకాదు రైలులో ప్రయాణించేటప్పుడు భద్రత కల్పించాలని పర్యాటకులు పోలీసులకు సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..