Viral Video: అర్ధరాత్రి గోడదూకి ఇంట్లో దూరిన ఎలుగుబంటి.. ఆ తరువాత ఏం చేసిందో మీరే చూడండి..!

Viral Video: అర్ధరాత్రి గోడదూకి ఇంట్లో దూరిన ఎలుగుబంటి.. ఆ తరువాత ఏం చేసిందో మీరే చూడండి..!
Bear

Viral Video: అడవుల్లో ఉండాల్సిన జంతువులు(Animals) జనావాసాల్లోకి(Public Places) వస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జనావాసాల్లోకి వచ్చి ప్రజలను..

Shiva Prajapati

|

Feb 12, 2022 | 4:40 PM

Viral Video: అడవుల్లో ఉండాల్సిన జంతువులు(Animals) జనావాసాల్లోకి(Public Places) వస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా కర్నూలు(Kurnool) జిల్లాలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. ఏకంగా ఓ ఇంట్లోకి ప్రవేశించి హల్‌చల్ చేసింది. శ్రీశైలం(Srisailam) సమీపంలోని సున్నిపెంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా సున్నిపెంట ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లోకి ఎలుగుబంటి ప్రవేశించింది. ఎలుగుబంటి రాకను గుర్తించిన స్థానికులు.. దానిని వీడియో తీశారు. ఎలుగుబంటి అటవీ ప్రాంతం నుంచి నేరుగా ఇళ్లను సమీపించింది. మెల్లగా ఇంటి గోడను దూకి ఇంట్లోకి ప్రవేశించింది. అయితే, దీనిని గమనించిన స్థానికులు భయంతో పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. ఎలుగుబంటిని తరిమేందుకు ప్రయత్నించారు. కాగా, గత నెల రోజులుగా అర్ధరాత్రి వేళల్లో ఎగులుబంటి సుండిపెంట గ్రామంలో సంచరించడం సాధారణంగా మారింది. ఇప్పుడు రాత్రి 9 గంటల సమయంలోనే ఊళ్లోకి రావడంతో స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. అయితే, చీకట్లో ఎలుగుబంటి ఎటువైపు వెళ్లిందో కనిపించకపోవటంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎట్నుంచి దాడి చేస్తుందోనేని భయపడిపోతున్నారు. ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. అడవి జంతువులు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also read:

Ishan Kishan IPL 2022 Auction: వేలంలో దుమ్ము రేపిన ఇషాన్ కిషన్.. హైదరాబాద్ అడ్డుపడినా తగ్గేదేలే అన్న ముంబై..!

Andhra Pradesh: భర్తను చంపి గొడ్ల చావిడిలో పాతిపెట్టిన భార్య.. 3వ రోజు దుర్వాసన రావడంతో

NTR: ఎన్టీఆర్‌కు బాలీవుడ్‌లో పెరుగుతోన్న క్రేజ్‌.. నిన్న దీపికా పదుకొణె, నేడు పాయల్‌ ఘోష్‌..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu