Viral News: అమ్మ ప్రేమ అంతే.. కరోనా భయంతో నెలల చిన్నారికి మాస్క్ వేసిన తల్లి.. నెట్టింట్లో వైరల్..

న్యూజిల్యాండ్‌లో కూడా తాజాగా మాస్క్‌ తప్పనిసరి అంటూ ఆదేశించింది ఆ దేశ ప్రభుత్వం. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించే వాళ్లందరూ మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది.

Viral News: అమ్మ ప్రేమ అంతే.. కరోనా భయంతో నెలల చిన్నారికి మాస్క్ వేసిన తల్లి.. నెట్టింట్లో వైరల్..
Baby Wearing Full Face Mask
Follow us

|

Updated on: Jul 06, 2022 | 3:07 PM

Viral News: రెండున్నర ఏళ్ల క్రితం చైనాలో(china) పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలలో కల్లోలం సృష్టించింది. రకరకాల రూపాలను సంతరించుకుంటూ మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సిన్ తో పాటు.. నివారణ చర్యలు తప్పనిసరి అని వైద్య బృందాలు హెచ్చరిస్తూనే ఉన్నయి. ఈ నేపథ్యంలో నోరు ముక్కు కవర్ చేసే విధంగా మాస్క్ ని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధరిస్తున్నారు. నిజానికి కరోనా వెలుగులోకి రాక ముందు చైనా, కొరియా, జపాన్ వంటి దేశాల్లోని సెలబ్రెటీలు ఇలా మాస్క్ ధరించడం సర్వసాధారణం.. అయితే బతికి బట్టకట్టాలంటే.. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్క వయసుతో సంబంధం లేకుండా మాస్క్ ధరించాల్సిందే అని అంటున్నారు.

కరోనా మహమ్మారి.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ మాస్క్‌ మస్ట్‌ అంటున్నాయి పలు దేశాలు. పలు దేశాల్లోని ప్రభుత్వాలు మాస్క్‌ ధరించడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి చేశాయి. అలాగే న్యూజిల్యాండ్‌లో కూడా తాజాగా మాస్క్‌ తప్పనిసరి అంటూ ఆదేశించింది ఆ దేశ ప్రభుత్వం. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించే వాళ్లందరూ మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా 12 సంవత్సరాలు పైబడ్డ వారంతా మాస్క్‌లు ధరించాలని, ఈ మేరకు తల్లిదండ్రులకు అధికారులు సూచించారు. అంతకన్నా చిన్న పిల్లలైతే వారికి కంఫర్ట్‌బుల్‌గా ఉండే మాస్క్‌లు వేయాలని సూచించారు.

ఈ క్రమంలో ఆక్లాండ్‌ నుంచి వెల్లింగ్టన్ వెళ్తున్న విమానంలో తన చిన్నారికి ఒక తల్లి వేసిన మాస్కు అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఆ పసికందును ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘ఈ పసికందు ఎంత సంతోషంగా నవ్వుతూ ఉందంటే.. విమానం దిగే సమయం అంతా సరదాగా గడిచిపోయింది’’ అని పోస్టు పెట్టాడు. ఈ ఫొటోలోని పసికందుకు పెద్ద వాళ్లు వేసుకునే మాస్కు వేసిందా తల్లి. అది ఆ పసివాడి మొఖమంతా కవర్ చేసేయడంతో కళ్ల వద్ద రెండు చిన్న రంధ్రాలు చేసింది. అది చూసి నెటిజన్లు ఇదేదో హారర్ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు చిన్న పిల్లలకు అలా మాస్కులు వేయకూడదని, అది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్