Viral News: నాగుపాముతో ఉడుత పంచాయతీ.. చివరికి ఎవరు గెలిచారో తెలుసా?

Viral News: నాగుపాముతో ఉడుత పంచాయతీ.. చివరికి ఎవరు గెలిచారో తెలుసా?
Viral Photo

Viral News: సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. వాటిపై నెటిజన్లు కూడా ఆసక్తి కనబరుస్తారు.

Shiva Prajapati

|

Apr 11, 2022 | 6:41 AM

Viral News: సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. వాటిపై నెటిజన్లు కూడా ఆసక్తి కనబరుస్తారు. అందుకే క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వార్తకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సాధారణంగా పాము ముంగీస పోట్లాడుకోవడం చూశాం.. కానీ ఉడుత, పాము పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? లేదంటే ఇప్పుడు చూసేయండి.

అవును, ఓ పాము ఉడుత మధ్య భీకర పోరు జరిగింది. ఓవైపు బుసలు కొడుతూ పాము ఉంటే.. మరోవైపు రెండు కాళ్లపై నిల్చుని చేతులు ముందరికి పెళ్లి ఉడుత నిల్చుంది. చిన్నపాటి ‘బాక్సింగ్ మ్యాచ్’ లా తలపించింది సీన్. డైలీ మెయిన్ కథనం ప్రకారం.. బోట్స్వానాలోని నోసోబ్‌ కలహరి ఎడారిలోని క్యాంప్‌సైట్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. కొంతమంది పర్యాటకులు వెకేషన్‌లో భాగంగా అక్కడ పర్యటిస్తున్నారు. ఆ సమయంలో ఉడుత, కోబ్రా పోట్లాడుకోవడం వారు గమనించారు వెంటనే.. వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దాదాపు 45 సెం.మీ పొడవున్న ఆఫ్రికన్ స్క్విరెల్.. విషపూరిత పామును ధైర్యంగా పోరాడింది. దాదాపు మూడుసార్లు పాము కాటు నుంచి తప్పించుకుంటుంది. 5 నిమిషాల పాటు వీటి పోరాటం సాగింది. ఈ రెండూ ఎంతమాత్రం తగ్గకపోవడంతో.. పర్యాటకులు ఆ పామును తరిమేశారు. వీటి పోరాటానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవికాస్తా వైరల్ అయ్యాయి.

Also read:

Food Coma: రాత్రి పూట తిన్న వెంటనే నిద్ర పోతున్నారా.. అయితే మీరు వీటిన తినడం మానేయాలి.. లేకుంటే ప్రమాదమే

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. స్థిరంగా ఉన్న బంగారం.. పెరిగిన వెండి ధర..!

Saving Account: సేవింగ్స్ ఖాతాపై 5% వడ్డీ ఇస్తోన్న బ్యాంక్.. కనీస మొత్తం ఎంత ఉండాలంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu