Viral News: చోరీకి గురైన కోటీశ్వరుని కుమార్తె ఆభరణాలు.. తిరిగి ఇస్తే రూ.57.5 కోట్ల బహుమతి ఇస్తానంటూ ప్రకటన

తమరా ఎక్లెస్టోన్ కు చెందిన 31 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ. 247 కోట్లు) విలువు చేసే నగలను గుర్తు తెలియని దుండగులు దొంగలించారు. తన ఇంట్లో దొంగిలించబడిన తన ఆభరణాలను తిరిగి తమరా ఎక్లెస్టోన్ రివార్డ్ గా రూ 57.5 కోట్లను ఇస్తానని ప్రకటించింది.

Viral News: చోరీకి గురైన కోటీశ్వరుని కుమార్తె ఆభరణాలు.. తిరిగి ఇస్తే రూ.57.5 కోట్ల బహుమతి ఇస్తానంటూ ప్రకటన
Tamara Ecclestone With Husb
Follow us

|

Updated on: Jul 28, 2022 | 11:23 AM

Viral News: దొంగతనానికి సంబంధించి ప్రతిరోజూ ఏదో ఒక సంఘటన చర్చనీయాంశంగా మారుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విచిత్ర వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక దొంగతనం గురించి మాత్రమే.. కాదు.. దొంగను పట్టిస్తే వచ్చే బహుమతి గురించి కూడా భారీగా ఉండడంతో.. ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రివార్డ్‌ గా ప్రకటించిన మొత్తం చాలా పెద్దది. ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ తినడం కాయం. బ్రిటన్ చరిత్రలోనే ఈ చోరీని అతిపెద్ద దొంగతనంగా పరిగణిస్తున్నారు. దీంతో ఆ నగలు విలువ ఎంత అనే విషయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో నివసిస్తున్న ఒక బిలియనీర్ కుమార్తె తాను పోగొట్టుకున్న నగలను తిరిగి పొందేందుకు బహుమతిగా నగల విలువలో 25 శాతం చెల్లిస్తానని హామీ ఇచ్చింది. ఈ బహుమతి ఎంత అని ఆలోచిస్తున్నారా.. వివరాల్లోకి వెళ్తే..

ఫార్ములా వన్ మాజీ ఎగ్జిక్యూటివ్, బ్రిటిష్ బిలియనీర్ బెర్నీ ఎక్లెస్టోన్ కుమార్తె అయిన తమరా ఎక్లెస్టోన్ నగల గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమరా ఎక్లెస్టోన్ కు చెందిన 31 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ. 247 కోట్లు) విలువు చేసే నగలను గుర్తు తెలియని దుండగులు దొంగలించారు. తన ఇంట్లో దొంగిలించబడిన తన ఆభరణాలను తిరిగి తమరా ఎక్లెస్టోన్ రివార్డ్ గా రూ 57.5 కోట్లను ఇస్తానని ప్రకటించింది. మీడియా నివేదికల ప్రకారం, 2019 సంవత్సరంలో ఈ ఆభరణాలు లండన్‌లోని తామరా స్వగృహంలో దొంగిలించబడినట్లు తెలుస్తోంది.

తన నగల దొంగతనం 2019 సంవత్సరంలో జరిగిందని తమరా చెప్పింది. ఈ సమయంలో తమరా,  జే రట్‌లాండ్ దంపతులు కుమార్తె సోఫియాతో కలిసి ఫిన్‌లాండ్‌కు వెళ్లారు. ఎవరూ లేని సమయంలో కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన విలువైన వస్తువులతో పాటు నగలను ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన నగల్లో కొన్ని ఆభరణాలు కుటుంబ వారసత్వంగా వస్తున్నాయని.. అందుకే అవి తనకు అత్యంత విలువైనవని తమరా ఎక్లెస్టోన్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

నగల గురించి సమాచారం కోసం.. BBC ఈ దొంగతనంపై మూడు డాక్యుమెంటరీలను కూడా రూపొందించింది. నవంబర్ 2021లో లండన్ పోలీసులు .. దొంగతనం ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఆ బృందంలోని నాల్గవ సభ్యుడు ఇంకా పట్టుబడలేదు.  ఎందుకంటే అతను సెర్బియా నుండి వచ్చాడు. అతనికి లండన్ పోలీసులకు అప్పగించడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తోంది. అందుకే నాల్గో నిందితుడిని లండన్‌ పోలీసులు విచారించలేకపోయారు.

తమరా దొంగిలించబడిన ఆభరణాలలో ఒక చెవి పోగులు మాత్రమే తిరిగి సొంతం చేసుకుంది. 2020 జనవరిలో ఒక మహిళ బ్యాగ్ నుంచి ఈ చెవి పోగులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తమరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దొంగతనం జరిగినప్పటి నుండి నా నగలను ఎప్పుడూ చూడలేదని.. వాటిని తిరిగి పొందుతానన్న ఆశ పోతుందని .. విచారణ వ్యక్తం చేసింది. చోరీకి గురైన వస్తువుల విలువ తన దృష్టిలో చాలా ఎక్కువ అని.. అందుకనే నగలను ఇచ్చిన వారికీ వాటి విలువలో 25 శాతం బహుమతిగా ఇస్తానని ప్రకటించినట్లు తమరా పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..