
Funny Weight Loss Video: బరువు తగ్గడం అనేది ఈ రోజుల్లో చాలా మందికి ఒక పెద్ద టాస్క్. జిమ్‌లు, డైటింగ్‌లు, యోగాలు అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం, బరువు తగ్గడానికి ఇంతకంటే ‘ఫాస్ట్ అండ్ సీక్రెట్ టిప్’ ఇంకొకటి ఉండదేమో అనిపించక మానదు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియో వివరాల్లోకి వెళితే.. అదొక ఇంటి లోపల జరిగిన సీసీటీవీ (CCTV) లో రికార్డైన వీడియో. ఇంట్లో ఒక మహిళ తన బరువును చూసుకోవడానికి వెయింగ్ మెషిన్ పై నిలబడటానికి సిద్ధమవుతోంది. అంతలోనే అక్కడికి ఆమె కొడుకు వచ్చాడు. ఎరుపు రంగు షర్టు వేసుకున్న ఆ అబ్బాయి, తల్లి బరువు చూసుకుంటూ బాధపడుతున్న సీన్ చూశాడు. ఈక్రమంతో ఓ గదిలోకి వెళ్లి మరో వెయింగ్ మెషిన్ తీసుకొచ్చాడు. దానిని తల్లి దగ్గరకు తీసుకొచ్చి దానిపై నిలబడమనిచెప్తాడు. అందుకు తల్లి ఓకే చెప్పి రెండు వెయింగ్ మెషిన్‌లపై రెండు కాళ్లు పెట్టి వెయిట్ చూసుకుంటుంది.
ఇది కూడా చదవండి: Video: ఓపికను టెస్ట్ చేస్తే ఇలాగే ఉంటది.. బుడ్డోడి దూల తీరిపోయిందిగా.. ఇదిగో వీడియో
ఆ మహిళ మెషిన్ పై నిలబడగానే, స్క్రీన్ మీద కేవలం 34 కేజీల బరువు మాత్రమే చూపించింది. సాధారణంగా ఒక వయోజన మహిళ బరువు అంత తక్కువగా ఉండటం అసాధ్యం. కానీ ఆ రీడింగ్ చూడగానే ఇంట్లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఆ అబ్బాయి చేసిన అల్లరి పనికి, అక్కడ ఉన్న వాతావరణం అంతా నవ్వులతో నిండిపోయింది.
Bí kíp giảm cân thần tốc cho các chị iem 😆 pic.twitter.com/04dU1ZdeO3
— Tú Nguyễn | Tyson (@anhtu9810) June 8, 2026
తన వెయిట్ చూసుకుని ఆశ్చర్యపోయిన తల్లి, ఆ కొడుకుతో కలిసి సంతోషంలో మునిగిపోయింది. ఇక ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ 60 సెకన్ల చిన్న వీడియో నెటిజన్లకు విపరీతంగా నచ్చింది. వియత్నామీస్ సబ్‌టైటిల్స్‌తో ఉన్న ఈ వీడియో భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో దీనికి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘సూపర్ ఫాస్ట్ వెయిట్ లాస్ సీక్రెట్ టిప్’ అనే ఫన్నీ క్యాప్షన్‌తో నెటిజన్లు దీనిని తెగ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 2.99 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. బరువు తగ్గాలని సీరియస్‌గా డైటింగ్ చేసే మహిళలు కూడా ఈ వీడియో చూసి, “మాకు కూడా ఇలాంటి వెయింగ్ మెషిన్ ఒకటి కావాలి బాబోయ్” అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
నిత్యం ఒత్తిడితో కూడిన జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సరదా క్షణాలు మనసుకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. బరువు తగ్గడం అనే సీరియస్ అంశాన్ని కూడా ఇంత హ్యాపీగా, నవ్వుకునేలా మార్చేసిన ఈ బుడతడి అల్లరి వీడియో ప్రస్తుతానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. నిజమైన బరువు తగ్గకపోయినా, ఈ వీడియో చూసిన వారి మనసులోని ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతుందనడంలో సందేహం లేదు!
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..