Viral Video: టీవీలో మాంసం ముక్కలు చూసి నోరూరింది.. ఆ కుక్క ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..

Viral Video: సాధారణంగానే నచ్చిన ఆహారం కనిపిస్తే నోట్లో లాలాజలం ఆటోమాటిక్‌గా ఊరుతుంది. ఇష్టమైన ఫుడ్‌ను తినేవరకు జిహ్వ లాగుతూనే ఉంటుంది.

Viral Video: టీవీలో మాంసం ముక్కలు చూసి నోరూరింది.. ఆ కుక్క ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..
Viral Video
Shiva Prajapati

|

Jun 25, 2022 | 2:08 PM

Viral Video: సాధారణంగానే నచ్చిన ఆహారం కనిపిస్తే నోట్లో లాలాజలం ఆటోమాటిక్‌గా ఊరుతుంది. ఇష్టమైన ఫుడ్‌ను తినేవరకు జిహ్వ లాగుతూనే ఉంటుంది. మనుషులకే కాదు.. భూమిపై ఉన్న ఏ జీవరాశికైనా ఇది వర్తిస్తుంది. పాపం ఇక్కడ ఓ కుక్క కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. కళ్లెదున ఇష్టమైన మాంసం ముక్క కనిపించినా.. అందుకోలేక అవస్థలు పడింది ఆ కుక్క. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అది టీవీలో కనిపిస్తున్న మాంసం అని తెలియక, నిజమైన మాంసమే అని భ్రమ పడుతూ ఆవురావురుమని ఆరాటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.. ఇంట్లోని వ్యక్తులతో పాటు పెంపుడు కుక్క కూడా టీవీ వీక్షిస్తోంది. ఇంతలో టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. అందులో మాంసం ముక్కలు కనిపించడంతో.. టీవీ ముందు కూర్చున్న కుక్కకు ఒక్కసారిగా నోరూరింది. వెంటనే ఆ ముక్కను అందుకోవాలని ప్రయత్నించింది. పాపం.. అది నిజమని తెలియని ఆ కుక్క.. టీవీ స్క్రీన్‌ను నాకుతూ ఆస్వాధించింది. అయితే, కుక్క అలా చేయడాన్ని వీడియో తీసిన యజమాని.. సంబంధిత వీడియోను MyChinaTrip అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఇది రుచికరమైన ఫుడ్’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ కుక్క ఆత్రుతను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మాంచి కరువులో ఉన్నట్లుంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వీడియోను 9.1 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా, 65 వేల పైగా లైక్స్ వచ్చాయి. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోనూ మీరూ చేసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu