5 మీటర్ల జుట్టు.. 80ఏళ్లుగా తల స్నానం కూడా చేయలేదట

మామూలుగా కాస్త హెయిర్‌ గ్రోత్‌ అయితే చాలు ఎప్పుడెప్పుడు దాన్ని కట్ చేయించాలా..? అని మగవాళ్లు ఆలోచిస్తుంటారు

5 మీటర్ల జుట్టు.. 80ఏళ్లుగా తల స్నానం కూడా చేయలేదట
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 26, 2020 | 4:51 PM

Vietnamese Man Long Hair: మామూలుగా కాస్త హెయిర్‌ గ్రోత్‌ అయితే చాలు ఎప్పుడెప్పుడు దాన్ని కట్ చేయించాలా..? అని మగవాళ్లు ఆలోచిస్తుంటారు. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం 80 ఏళ్లుగా జుట్టును పెంచుతూనే ఉన్నాడు. ఇప్పుడు అతడి జుట్టు 5 మీటర్ల పొడవైంది. ఇంతవరకు తాను జుట్టును కట్ చేయించలేదని, తలస్నానం చేయలేదని అతడు చెబుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. ”వియత్నాంకు చెందిన న్గుయెన్ వాన్ చియెన్(92) అనే వ్యక్తి 80 ఏళ్లుగా తన జుట్టును పెంచుకుంటూనే ఉన్నాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ జుట్టును కట్ చేస్తే నేను చచ్చిపోతానని నమ్ముతా. మార్పును నేను కోరుకోవడం లేదు. ఇంతవరకు నేను జుట్టును దువ్వలేదు. కేవలం సంరక్షణ మాత్రమే తీసుకుంటాను. బయటకు వెళ్లినప్పుడు దుమ్ము పడకుండా స్కార్ఫ్‌ను కట్టుకుంటాను” అని అన్నారు. స్కూల్‌లో చదువుకున్నప్పుడు న్గుయెన్‌ జుట్టు కట్‌ చేసుకునేవాడట. అయితే మూడో తరగతి చదువుతున్నప్పుడు జుట్టు కట్ చేయకూడదని, స్నానం చేయకూడదని, దువ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చియెన్ ఐదో కుమారుడు ఆయనను చూసుకుంటున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu