Viral: కెమెరా ఆఫ్ చేయకుండా ప్రేయసితో శృంగారం.. ‌ఆన్‌లైన్ క్లాసులో లైవ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

Viral: కెమెరా ఆఫ్ చేయకుండా ప్రేయసితో శృంగారం.. ‌ఆన్‌లైన్ క్లాసులో లైవ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
Online Class

కరోనా కారణంగా విద్యార్ధుల చదువులు అటకెక్కుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో.. వాళ్లు పాఠాలు వినడం అటుంచితే.. కెమెరా ఆన్ చేసి చేస్తున్న పనులే..

Ravi Kiran

|

Jul 03, 2021 | 12:03 PM

కరోనా కారణంగా విద్యార్ధుల చదువులు అటకెక్కుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో.. వాళ్లు పాఠాలు వినడం అటుంచితే.. కెమెరా ఆన్ చేసి చేస్తున్న పనులే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఒక్కోసారి ఆన్‌లైన్ క్లాసులు విపరీత పరిణామాలకు కూడా దారి తీస్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కెమెరా ఆఫ్ చేశాననుకుని ఓ విద్యార్ధి చేసిన పనికి టీచర్, సహా విద్యార్ధులందరూ కూడా అవాక్కయ్యారు. ఈ ఘటన వియత్నాంలో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

వియత్నాంలోని హోచీమిన్ నగరంలో ఓ విద్యార్ధి ఆన్‌లైన్ క్లాస్ జరుగుతున్నప్పుడు తన పార్టనర్‌తో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ విద్యార్ధి తన మొబైల్ కెమెరాను ఆఫ్ చేయడం మర్చిపోయాడు. ఇంకేముంది అక్కడ జరుగుతున్న యాక్ట్ అంతా కూడా లైవ్‌లో కనిపిస్తోంది. మిగతా విద్యార్ధులంతా క్లాస్ వినడం మానేసి.. ఫోకస్ అటు షిఫ్ట్ చేశారు. దీనికి సంబంధించిన క్లిప్ గతవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ పాడుపనికి విద్యార్ధిపై లెక్చరర్ గుస్సా అయ్యాడు. ”నువ్వు ఏం చేస్తున్నావో అర్ధమవుతోందా? ఫిజికల్ క్లాస్ జరుగుతున్నప్పుడు.. నీ గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చేస్తావ్.. ఇప్పుడు ఆన్‌లైన్ క్లాస్‌లో ఉన్నాం. ఇప్పుడు కూడా సెక్స్ కావాల్సి వచ్చిందా.! అని ఫైర్ అయ్యాడు. లెక్చరర్ పీకిన క్లాస్‌కు తన తప్పును గ్రహించిన ఆ విద్యార్ధి వెంటనే కెమెరా ఆఫ్ చేసి బట్టలు ధరించేందుకు పరుగుపెట్టాడు. ఆ తర్వాత అతడు లెక్చరర్, మిగతా విద్యార్ధులకు క్షమాపణలు చెప్పినట్లు వియత్నాం న్యూస్ పేపర్ లోడాంగ్ ఓ కథనంలో పేర్కొంది. కాగా, ఈ ఘటన అనంతరం యూనివర్సిటీ స్ట్రిక్ట్ రూల్స్ అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై ఆన్‌లైన్ క్లాసుల్లో సరిగ్గా ప్రవర్తించాలని వెల్లడించింది.

కాగా, 2021 ఫిబ్రవరిలో ఆన్‌లైన్ క్లాస్‌‌ జరుగుతున్నప్పుడు శ్వేతా అనే అమ్మాయి తన ఫ్రెండ్‌తో జరిగిన సంభాషణలను మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయకుండా ఆన్‌లైన్ క్లాసులో చెప్పడం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టిన విషయం విదితమే.

Also Read: 

రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి

వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్‌ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu