ఈ గుడ్లగూబలు ఎంత హుషారో.. మీరే చూడండి ఏం చేశాయో..

సీక్రెట్ కెమెరా.. దీని ఉపయోగాలు మనకు తెలిసిందే. సాధారణంగా ఎదుటి వారు మనకు తెలియకుండా ఏంచేస్తున్నారో చూసేందుకు.. దొంగతనాలు జరిగితే.. ఎవరు చేశారన్నది తెలుసుకునేందుకు నిఘా నేత్రాలుగా వీటిని వాడుతున్నాం. అయితే ఒక్కోసారి ఈ నిఘా నేత్రాలకు చిక్కే విజువల్స్.. ఆశ్చర్యాన్నే కాదు.. నవ్వును కూడా తెప్పిస్తాయి. ఆ కోవలోకే చెందిన ఓ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎవరైనా మన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ.. సీసీ కెమెరాలు పెడితే ఊరుకుంటామా.. ఎవడు పెట్టారో కనుక్కోవడమే కాదు.. […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:02 pm, Fri, 9 August 19
ఈ గుడ్లగూబలు ఎంత హుషారో.. మీరే చూడండి ఏం చేశాయో..

సీక్రెట్ కెమెరా.. దీని ఉపయోగాలు మనకు తెలిసిందే. సాధారణంగా ఎదుటి వారు మనకు తెలియకుండా ఏంచేస్తున్నారో చూసేందుకు.. దొంగతనాలు జరిగితే.. ఎవరు చేశారన్నది తెలుసుకునేందుకు నిఘా నేత్రాలుగా వీటిని వాడుతున్నాం. అయితే ఒక్కోసారి ఈ నిఘా నేత్రాలకు చిక్కే విజువల్స్.. ఆశ్చర్యాన్నే కాదు.. నవ్వును కూడా తెప్పిస్తాయి. ఆ కోవలోకే చెందిన ఓ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఎవరైనా మన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ.. సీసీ కెమెరాలు పెడితే ఊరుకుంటామా.. ఎవడు పెట్టారో కనుక్కోవడమే కాదు.. దానిపై మన ప్రతాపం చూపిస్తూ.. ధ్వంసం చేస్తాం కదా.. అలానే  గుడ్లగూబలు కూడా ప్రయత్నించాయి. అవి కూడా మనలాగే రియాక్ట్ అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అరుదైన గుడ్లగూబల్ని పరిశోధించే ఉద్దేశంతో సైంటిస్టులు.. ఓ సీక్రెట్ కెమెరాను.. వాటి గూడు దగ్గర సెట్ చేశారు. ఆ తర్వాత ఆ గూడు నుంచి రెండు గుడ్లగూబలు బయటకు వచ్చాయి. ఎప్పుడూ లేనిది… అక్కడ ఏదో వస్తువు ఉన్నట్లు అనిపించడంతో ఆ గుడ్లగూబలు కంగారు పడ్డాయి. తమపై దాడి చేసేందుకో.. లేక బంధించేందుకు ఎవరో ఏదో అక్కడ పెట్టారని టెన్షన్ పడ్డట్లు ఆ వీడియోలో వాటి హావభావాలు నిక్షిప్తమయ్యాయి. కెమెరా దగ్గరకు వచ్చి… దాని లెన్స్‌లో కళ్లు పెట్టి మరీ చూసి కెమెరాను కాలితో తన్నాయి. అంతే… ఏదో షూట్ చేద్దామనుకుంటే… ఈ చిత్రమైన వీడియో షూట్ అయ్యింది. కావాలంటే మీరు కూడా ఆ వీడియో చూడండి.