Viral Video: నువ్వు తోపువు సామి.. నోట్లో సిగరేట్.. చేతిలో లాండ్‌మైన్.. చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపై దాడులు చేస్తోంది. అయితే ఈ సమయంలో ఇక్కడ ఓ వీడియో సంచలనంగా మారుతోంది.

Viral Video: నువ్వు తోపువు సామి.. నోట్లో సిగరేట్.. చేతిలో లాండ్‌మైన్.. చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..
Ukrainian Man Removes Land
Follow us

|

Updated on: Mar 02, 2022 | 12:25 PM

Russia Ukraine War Viral Video: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌లో అకస్మాతుగా వచ్చిపడుతున్న బాంబులు.. ఆరు రోజులాగా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే రష్యా దాడులను ఉక్రెయిన్ పౌరులు తిప్పికొడుతున్నారు. కొందరు ఆర్మీకి సహాయంగా ముందుకు కదులుతున్నారు. రష్యా చేస్తున్న దాడులను తిప్పికొట్టే పనిలో తెగ బిజీగా ఉన్నారు. ఉక్రేనియన్ మహిళ రష్యన్ సైనికుల ముందు నిలబడి వారికి పొద్దుతిరుగుడు విత్తనాలను ఇచ్చి ఈ విత్తనాలను మీ జేబులో పెట్టుకోండి. మీరు చనిపోయినప్పుడు ఈ విత్తనాలు ఉక్రెయిన్ మట్టిలో పెరుగుతాయని ధైర్యంగా మాట్లాడే వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మరో వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఉక్రెయిన్‌లోని నగరాలను ఆక్రమించుకుంటున్న రష్యా సైనం.. అక్కడి రహదారులపై ల్యాండ్ మైన్లను ఏర్పాటు చేస్తోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఉక్రెయిన్ పౌరుడు చేసిన పనికి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో అతను ఓ లాండ్ మైన్‌ను చేతిలో పట్టుకుని ముందుకు వెళ్తున్న దృశ్యాలను చూడవచ్చు. ల్యాండ్ మైన్‌ పట్టుకున్న ఆ పౌరుడు నోట్లో మాత్రం సిగరేట్ తాగుతూ కనిస్తాడు.

అతను ఓ వైపు సిగరేట్ కాల్చుతూనే ఆ లాండ్ మెన్ తీసుకెళ్లడం సంచలనంగా మారింది. ఈ వీడియో ఇప్పుడు అన్ని సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతోంది. ఇతడిని మెచ్చుకుంటూనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి: Summer Health Tips: వేసవిలో ఆ నీరే అమృతం.. కుండ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Hair Care Tips: డ్రై హెయిర్‌తో ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..