Diamond Ring: కోట్లు ఖరీదు చేసే డైమండ్‌ని చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. కారణమేంటంటే..

Diamond Ring: సాధారణంగా ఫుట్‌పాత్‌పై అమ్మే వస్తువులు చౌకగా దొరకడంతో సరదాగా కొంటుంటాం. ఒక్కొసారి ఆ వస్తువుల్లో కొన్ని అనూహ్యంగా బ్రాండెడ్‌, విలువైన వస్తువులాంటివి దొరుకుతాయి.

Diamond Ring: కోట్లు ఖరీదు చేసే డైమండ్‌ని చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. కారణమేంటంటే..
Diamond Ring
Follow us

|

Updated on: Oct 31, 2021 | 9:29 AM

Diamond Ring: సాధారణంగా ఫుట్‌పాత్‌పై అమ్మే వస్తువులు చౌకగా దొరకడంతో సరదాగా కొంటుంటాం. ఒక్కొసారి ఆ వస్తువుల్లో కొన్ని అనూహ్యంగా బ్రాండెడ్‌, విలువైన వస్తువులాంటివి దొరుకుతాయి. పైగా చాల చౌక ధరలో మనకు లభించిందని సంతోషంగా ఫీలవుతాం. అదే కోట్ల ఖరీదు చేసే వస్తువు దొరకితే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అచ్చం అలానే ఒక బామ్మకి రూ. 20 కోట్లు విలువ చేసే డైమండ్‌ లభించింది. కానీ, ఆ రింగ్‌.. డైమండ్ రింగ్ అని తెలియక.. చెత్త బుట్టలో పడేయాలని నిర్ణయించుకుంది. ఇంతలో విషయం తేలడంతో అవాక్కైంది.

వివరాల్లోకెళితే.. యూకే కి చెందిన 70 ఏళ్ల బామ్మ చాలా ఏళ్ల క్రితం ఒక స్టోన్‌ రింగ్‌ని కొనుగోలు చేసింది. అది ఏ ప్రాంతంలో ఎప్పుడు కొన్నదో కూడా ఆమెకు గుర్తు లేదు. అసలు ఆ డైమండ్ రింగ్ గురించి మరచిపోయింది. అయితే, ఒకరోజు ఇంట్లో అనవసరమైన వస్తువులను డస్ట్‌ బిన్‌లో పడేస్తూ అనుహ్యంగా ఈ స్టోన్‌ రింగ్‌ని కూడా పడేయబోయింది. కానీ ఆమె పక్కింటి వాళ్లు ఒకసారి దానిని పరీక్షించాల్సిందిగా సూచించారు. అది మామూలు రింగ్‌లా లేదని, డైమండ్ మాదిరిగా కనిపిస్తోందని చెప్పారు. దాంతో వారి సూచన మేరకు పరీక్షించి తెలుసుకుందాం అనుకుంది.

ఫీటన్‌బై ఆక్షన్‌ హౌజ్‌ దగ్గరికెళ్ళి ఆమె స్టోన్‌ రింగ్‌ చూపించి విలువ కట్టమంది. ఒక పౌండ్‌ నాణెం కంటే పెద్ద రాయిలాగా ఉండటంతో డైమండ్‌ టెస్టర్‌తో టెస్ట్‌ చేయించారు ఆక్షన్‌ హౌస్‌ నిర్వాహకులు. ఆ తర్వాత బెల్జియంలో డైమండ్‌ నిపుణుల చేత నిర్థారించగా అది 24 కోట్ల రూపాయలు విలువ చేసే 34 క్యారెట్ల డైమండ్‌గా తేలింది. తను పడేయాలనుకున్న స్టోన్‌ రింగ్‌ విలువ కోట్లలో ఉందని తెలుసుకుని షాక్ అయ్యింది. ఆ తరువాత తేరుకుని సంతోషం వ్యక్తం చేసింది ఆ వృద్ధురాలు.

Also read:

Harihara Veeramallu: ‘హరి హర వీరమల్లు’ సినిమాలో అకీరా..? వీడియో

Manchu Vishnu-Hyper Aadi: అరరే.. ఈ డైలాగ్స్ ఎక్కడో విన్నట్లుందే.. హైపర్ ఆది పంచులు మాములుగా లేవుగా.

ONGC Recruitment 2021: ఓఎన్‎జీసీలో 309 గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ..