Viral Video: రెండు పాముల మధ్య చిగురించిన ప్రేమ.. ఎలా ముద్దు పెట్టుకున్నాయో చూడండి..!

Viral Video: ‘మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది.. అబబా బలేగుంటది..’ శివయ్య సినిమాలోని ఈ పాటకు హీరో రాజశేఖర్, హీరోయిన్ సంఘవి కలిసి వేసిన స్టెప్పులు..

Viral Video: రెండు పాముల మధ్య చిగురించిన ప్రేమ.. ఎలా ముద్దు పెట్టుకున్నాయో చూడండి..!
Snakes
Shiva Prajapati

|

Aug 16, 2022 | 10:27 PM

Viral Video: ‘మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది.. అబబా బలేగుంటది..’ శివయ్య సినిమాలోని ఈ పాటకు హీరో రాజశేఖర్, హీరోయిన్ సంఘవి కలిసి వేసిన స్టెప్పులు ఇప్పటికీ అందరికీ గుర్తే. ఆ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, మనుషులకు ముద్దు గురించి తెలుసు.. ప్రేమికులు, భార్యభర్తలు తమ భాగస్వామికి ముద్దు పెట్టడం కామన్. ఇక సరిసృపాల్లో రెండు పాములు సయ్యాటలాడటం కూడా కామన్. మరి రెండు పాములు ముద్దు పెట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? అయితే, ఇప్పుడు చూసేయండి. పైన పేర్కొన్న పాట పల్లవికి సరిగ్గా సరిపోలేలా ఆ సీన్ ఉంటుంది. అవును.. రెండు పాములు కళ్లలోకి కళ్లు పెట్టుకుని చూసుకుంటూ ముద్దు పెట్టుకున్నాయి. దానికి సంబంధించిన వీడియో, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

snake.world అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మొదట రెండు పాములు ఒకదానికొకటి చూసుకుంటూ శృంగారంలో మునిగి తేలాయి. రెండూ చూపులు కలిపి.. ముద్దు పెట్టుపెట్టుకున్నాయి. ఆ తరువాత లోకం మరచి నాట్యం చేస్తూ శృంగారంలో రెచ్చిపోయాయి సర్పాలు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు స్నేక్ లవర్స్ దానిని ఆసక్తిగా చూస్తుండగా.. సామాన్య నెటిజన్లు మాత్రం భయంతో వణికిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu