Viral Video: రోడ్డెక్కిన భారీ కొండచిలువలు.. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవలేదు. ప్రతీ రోజూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి...

Viral Video: రోడ్డెక్కిన భారీ కొండచిలువలు.. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. వీడియో చూస్తే  నోరెళ్లబెట్టాల్సిందే!
Python

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవలేదు. ప్రతీ రోజూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇక ఈ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో రెండు భారీ కొండచిలువలు ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటిస్తున్నాయో చూస్తే మీరూ నోరెళ్ళబెడతారు.

అడవులు, చెట్లు పుట్టలు కనుమరుగవుతున్న వేళ..జంతువులు, విష సర్పాలు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. అలా దారి తప్పి వచ్చిన రెండు పొడవైన కొండచిలువలు రద్దీగా ఉండే రోడ్డెక్కాయి. పాపం వాటికి కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పలేదు. దాంతో ఎలా వెళ్తున్నాయో చూడండి. ఈ ఘటన తెలంగాణాలోని హనుమకొండ జిల్లాలో జరిగింది. ఆ వివరాలు..

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారిపేటగుట్టలో జాతీయ రహదారిపై రెండు కొండచిలువలు రోడ్డెక్కిన వైనం ఆసక్తిగా మారింది. రోడ్డెక్కిన కొండచిలువలు రోడ్డుపై అడ్డదిడ్డంగా పాకుతూ పోకుండా రోడ్డు సైడ్ న పద్ధతిగా ఒకదాని వెనుక ఒకటి పాకుతూ పోవడం చూసి వాహనదారులు, ప్రయాణికులు ఆశ్చర్య పోయారు..ఇవి కూడా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తున్నాయా ఏంటీ.. అనుకుంటూ నోరెళ్లబెట్టారు..అప్పుడప్పుడు జ్ఞానం ఉన్న మనుషులే రోడ్డుపై అస్తవ్యస్తంగా ప్రయాణిస్తూ అనేక చిక్కుల్లో పడుతుంటారు. మూగజీవాలైన కొండచిలువలు ఇలా క్రమ పద్ధతిలో రోడ్డుపై పాకడంతో స్థానికులంతా ఆసక్తిగా చూశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu