Viral Video: వామ్మో.. దేనికోసమో ఈ అత్యవసర మీటింగ్.. పులులను చూస్తే గుండె గుభేల్ అనాల్సిందే..

నీటి ప్రవాహం దగ్గరకు చేరి పులులన్నీ ఆనందిస్తుంటాయి. కానీ, చూస్తుంటే అలా అస్సలు కనిపించడం లేదని.. ఏదో వేట కోసం అన్ని సమావేశమైనట్లు కనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Viral Video: వామ్మో.. దేనికోసమో ఈ అత్యవసర మీటింగ్.. పులులను చూస్తే గుండె గుభేల్ అనాల్సిందే..
Viral Video
Shaik Madarsaheb

|

Aug 10, 2022 | 1:58 PM

Tigers Pool Party Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా, భయంకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా.. పులులకు సంబంధించిన భయంకరమైన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. పులులన్నీ కొలను దగ్గర సమావేశం అయ్యాయి. నీటి ప్రవాహం దగ్గరకు చేరి పులులన్నీ ఆనందిస్తుంటాయి. కానీ, చూస్తుంటే అలా అస్సలు కనిపించడం లేదని.. ఏదో వేట కోసం అన్ని సమావేశమైనట్లు కనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ వైరల్ వీడియోను మంగళవారం ట్విట్టర్‌లో ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (IFS) సుశాంత నంద షేర్ చేశారు.

ఈ వైరల్ వీడియోలో నీటి కొలనులో కూర్చొని నాలుగు పులులు సేద తీరుతున్న దృశ్యాన్ని వీక్షించవచ్చు. దీనిలో మరొక పులి కూర్చోవడానికి మంచి ప్రదేశం కోసం తిరుగుతూ.. కనిపిస్తుంది. ఈ సమయంలో ఆకస్మాత్తుగా పులులన్నీ ఏదో చూస్తున్నట్లు కనిపిస్తాయి. వాటిలో ఒకటి అక్కడ నుంచి.. వేట కోసం పయనమవుతున్నట్లు కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వైరల్ వీడియోను చూడండి..

పలుల వీడియో చూడండి..

పోస్ట్‌ను పంచుకుంటూ ఐఎఫ్ఎస్ నందా.. ఈ విధంగా రాశారు. భారతదేశంలో పులుల సంరక్షణ విజయానికి నీరు, ఆహార భద్రత కీలకం అంటూ పేర్కొన్నారు. ఈ పులుల కుటుంబం రుతుపవనాలను ఆస్వాదిస్తున్నాయంటూ పేర్కొన్నారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో 30 వేల మంది వీక్షించగా.. వేలాది మంది లైక్ చేశారు. అంతేకాకుండా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అవన్నీ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాయని ఒకరు కామెంట్ చేయగా.. ఈ పులులు మద్యం లేకుండా నాన్ వెజ్‌తో పూల్ పార్టీ చేసుకుంటున్నాయంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu