Viral Video: ప్రేమను వ్యక్తపరచడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. తన ప్రేయసిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో ప్రియుడు పడరాని పాట్లు పడుతుంటాడు. అయితే ఇలాంటి లవ్ ప్రపోజల్స్‌కు సీన్స్‌ను సినిమాల్లో ఎంతో అద్భుతంగా చూపిస్తున్నారు. సినిమాల్లో చూపించే విధంగా హీరోల్లా ప్రపోజ్ చేయడం నిజ జీవితంలో కుదరదు. అయితే తాజాగా ఓ వ్యక్తి తన ప్రేయసికి చేసిన ప్రపోజ్ మాత్రం సినిమాలను సైతం తలదన్నేలా ఉంది. అమెరికాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే అమెరాకలోని న్యూయార్క్ నగరంలో ఇటీవల ‘బఫెలో మారథాన్’ జరిగింది. ఇందులో మాడిసన్ అనే యువర్ రన్నర్ పాల్గొంది. ఈ క్రమంలోనే ఆమె పోటీ దారులను అందరినీ వెనక్కి నెట్టేసి ఫినిషింగ్ లైన్‌కు చేరుకుంటోంది. అదే సమయంలో ఆ ఫినిష్ లైన్ దగ్గరా ఆమె ప్రియుడు క్రిస్టఫర్ జేమ్స్ ఎదరు చూస్తూ ఉన్నాడు. తీరా మాడిసన్ ఫినిషింగ్ లైన్‌కు చేరుకునే సమయానికి మోకాలిపై కూర్చొని ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. చేతిలో ఉన్న రింగ్ బాక్స్‌ను చూపిస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు.
దీంతో ఒక్కసారి సంతోషంతో మాడిసన్, ప్రియుడిని హత్తుకుంది. ఈ సన్నివేశాన్ని చూసిన వారంతా ఈ జంటను చూసి చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రియుడు ప్రపోజ్ చేసిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఈ చివరి లైన్ నా ప్రియమైన స్నేహితురాలితో గడిపే మొత్తం జీవితానికి మొదటి లైన్’ అంటూ రాసుకొచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
View this post on Instagram
మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..