Viral: వాయమ్మో.. ఇవేం ఆన్సర్స్ స్వామి.. వీళ్లు మాములు ఆణిముత్యాలు కాదు.. నెక్ట్స్ లెవల్

తాజాగా ఓ ఇద్దరు జాతి రత్నాలు ఎగ్జామ్స్‌లో రాసిన ఆన్సర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఆన్సర్స్ చూస్తే మీరు స్టన్ అవ్వడం ఖాయం.

Viral: వాయమ్మో.. ఇవేం ఆన్సర్స్ స్వామి.. వీళ్లు మాములు ఆణిముత్యాలు కాదు.. నెక్ట్స్ లెవల్
Students Funny Answers
Ram Naramaneni

| Edited By: Ganesh Mudavath

Jul 04, 2022 | 11:52 PM

Trending: ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) యూజ్ చెయ్యనివారు ఎవరు ఉన్నారు చెప్పండి. నెట్టింట డైలీ వైరల్ కంటెంట్ సర్కులేట్ అవుతుంది. ఎక్కువగా పన్నీ వీడియోలు, పన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతుంటాయి. వాటిని చూసి ఎంజాయ్ చెయ్యడమే కాదు తమ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తుంటారు. కాగా ఎగ్జామ్స్ సమయంలో జాతిరత్నాలు రాసిన ఫన్నీ ఆన్సర్స్ సైతం ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. మాములుగా ప్రతి క్లాసులో ఇలాంటివారు ఉంటారు. ఇచ్చిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే ఏదో ఒక సోది రాసి ఆన్సర్ షీట్ నింపేస్తారు.  గతంలో అయితే సోషల్ మీడియా వినియోగం లేదు కాబట్టి ఈ ఫన్నీ ఆన్సర్స్ అంత వైరల్ అయ్యేవి కావు.. ఇప్పుడు ఆ పేపర్స్ దిద్దిన టీచర్స్, లేదా తోటి ఫ్రెండ్స్ వాటిని ఫేస్‌బుక్, ఇన్ స్టా, ట్విట్టర్లలో పోస్ట్ చేస్తూ ఉండటంతో.. వాటిని జనాలు విపరీతంగా లైక్ చేస్తున్నారు. తాజాగా ఓ స్టూడెంట్ లెక్కల్లో ఓ ప్రశ్నకు పిచ్చెక్కించే సమాధానం రాశారు. ఆ ఆన్సర్ చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. K ఈక్వల్స్ టూ 1 ఫ్లస్ Sin x బై n ను సాల్వ్ చేయమంటే.. ఈ క్రియేవిట్ ఫెల్లో పైన n కింద n  కొట్టేసి.. 1 ఫ్లస్ Six ఈక్వల్స్ టూ 7 అని రాసేశాడు. ఇది చూసిన టీచర్.. ఆ ఆన్సర్‌ను కొట్టేయడమే కాదు స్టూపిడ్ అని రాశారు. మరో స్టూడెంట్ అంతే క్రియేటివ్ స్టైల్లో ఆన్సర్ రాయగా.. టీచర్ కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా అదే లెవల్‌లో రిప్లై ఇచ్చి జీరో మార్కులు వేశారు. ప్రజంట్ ఈ ఫన్నీ ఆన్సర్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ‘వీళ్లండి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్’.. ‘వీళ్లే అసలైన జాతిరత్నాలు’ అంటూ పంచ్‌లు పేలుస్తున్నారు నెటిజన్స్.

Students Funny Answers

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu