హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కోసం ‘టాక్సీ‌వాలా’ మాస్టర్ ప్లాన్..!

హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కోసం 'టాక్సీ‌వాలా' మాస్టర్ ప్లాన్..!

హైదరాబాద్: ఐపీఎల్ వచ్చిందంటే ప్రజలు ఊగిపోతారు. రిలీజ్ అయిన కొత్త సినిమాలు, ఎన్నికలను సైతం లైట్ తీసుకుని.. మ్యాచ్ వస్తున్నంత సేపు మొబైల్ ఫోన్స్ కు గానీ, టీవీలకు గానీ అతుక్కుపోతారు. ఇది ఇలా ఉంటే మ్యాచ్ టైంలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, బయట రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి.? మాటి మాటికీ ఫోన్ ఓపెన్ చేసి.. స్కోర్ ఎంత అని చెక్ చేసుకోవాల్సిందే కదా.? అని అనుకున్న ఒక టాక్సీ‌వాలా ఐపీఎల్ అభిమానుల […]

Ravi Kiran

|

Apr 08, 2019 | 8:04 PM

హైదరాబాద్: ఐపీఎల్ వచ్చిందంటే ప్రజలు ఊగిపోతారు. రిలీజ్ అయిన కొత్త సినిమాలు, ఎన్నికలను సైతం లైట్ తీసుకుని.. మ్యాచ్ వస్తున్నంత సేపు మొబైల్ ఫోన్స్ కు గానీ, టీవీలకు గానీ అతుక్కుపోతారు. ఇది ఇలా ఉంటే మ్యాచ్ టైంలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, బయట రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి.? మాటి మాటికీ ఫోన్ ఓపెన్ చేసి.. స్కోర్ ఎంత అని చెక్ చేసుకోవాల్సిందే కదా.? అని అనుకున్న ఒక టాక్సీ‌వాలా ఐపీఎల్ అభిమానుల కోసం ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు. ఇక ఆ టాక్సీ‌వాలా ఉండేది మరెక్కడో కాదండీ.. మన హైదరాబాద్‌లోనే. ఆ టాక్సీ‌వాలా తను నడుపుతున్న కారు మీద ఓ లైవ్ స్కోర్ బోర్డు ఏర్పాటు చేశాడు.

కాగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లైవ్ స్కోర్ కార్డును ఆ బోర్డులో డిస్‌ప్లే చేశాడు. రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ట్యాక్సీవాలా టాలెంట్ ను చూసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అయిపొయింది. ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా దాన్ని ట్వీట్ చేసింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu