కొరియర్‌ బాక్స్‌ని ఓపెన్‌ చేసిన కస్టమర్‌.. వామ్మో అంటూ పరుగెత్తాడు..? ఎందుకో తెలుసా..

Cobra Snake: బెంగుళూరు నుంచి ఒక కస్టమర్‌కి కొరియర్ వచ్చింది. బాక్స్‌ ఓపెన్‌ చేసి చూసిన వెంటనే పెద్దగా అరిచాడు. దానిని అక్కడే పడేసి అక్కడి నుంచి పరుగెత్తాడు.

కొరియర్‌ బాక్స్‌ని ఓపెన్‌ చేసిన కస్టమర్‌.. వామ్మో అంటూ పరుగెత్తాడు..? ఎందుకో తెలుసా..
Courier Box
uppula Raju

|

Nov 17, 2021 | 5:59 AM

Cobra Snake: బెంగుళూరు నుంచి ఒక కస్టమర్‌కి కొరియర్ వచ్చింది. బాక్స్‌ ఓపెన్‌ చేసి చూసిన వెంటనే పెద్దగా అరిచాడు. దానిని అక్కడే పడేసి అక్కడి నుంచి పరుగెత్తాడు. ఇంతకీ అందులో ఏముందో తెలుసా.. కొరియర్ బాక్స్‌లో సామానుకి బదులు నాగుపాము ప్రత్యక్షమైంది. అసలు ఆ పాము కొరియర్ బాక్సులోకి ఎలా వచ్చినట్లు పూర్తి వివరాలు తెలుసుకోండి.. సునీల్ లఖేటే అనే వ్యక్తి కూతురు బెంగళూరులో పనిచేస్తోంది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా రోజులుగా ఇంటి నుంచే పని చేస్తోంది.

ఈ కారణంగా సునీల్ లఖేటే తన కుమార్తె వస్తువులన్నింటినీ బెంగళూరు నుంచి నాగ్‌పూర్‌కు తీసుకురావాలనుకున్నాడు. ఇందుకోసం ఒక పెద్ద కొరియర్ కంపెనీకి పని అప్పజెప్పాడు. కంపెనీ అన్ని వస్తువులను ఒక బాక్స్‌లో పార్సల్‌ చేసి నాగ్‌పూర్‌కి పంపించింది. కంపెనీకి చెందిన కొరియర్ బాయ్ అన్ని వస్తువుల బాక్సులను లఖేటే ఇంటికి డెలివరీ చేశాడు. సునీల్ లఖాటే వీటిలో ఒక బాక్స్‌ తెరిచి చూడగా అందులో నుంచి విషపూరితమైన నాగుపాము బయటకు వచ్చింది.

నాగుపాము కొరియర్‌ బాక్స్‌ నుంచి బయటికి వచ్చి ఇంట్లో చొరబడింది. దీంతో సునీల్ గుండెల్లో భయం పెరిగింది. నిస్సహాయంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు. కొంతసేపటికి స్నేక్‌క్యాచర్‌కి ఫోన్ చేశారు. అతడు పాముని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పాము కనిపించలేదు. అసలు ఆ పాము కొరియర్‌ బాక్స్‌లోకి ఎలా వచ్చిందని పరిశీలించగా దానికి ఒక పెద్ద రంధ్రం కనిపించింది. బహుశా దాని నుంచే పాము బాక్స్‌లోకి వెళ్లినట్లుందని నిర్దారించారు. అయితే పాము కనిపించకపోవడంతో సునీల్ లఖాటే కుటుంబ సభ్యులు భయంతో ఉన్నారు.

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్‌.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..

పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?

David Warner: డేవిడ్‌ వార్నర్‌ని బలవంతంగా తొలగించారా..! సన్‌రైజర్స్‌ కోచ్ ఏం చెప్పాడంటే..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu