Viral Video: సోకులు మామూలుగా లేవుగా.. అచ్చం మనిషిలా రెండు కాళ్లపై నడుస్తూ.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు డంప్ అవుతుంటాయి. ప్రపంచంలో అనేక సంఖ్యలో జంతువులున్నప్పటికీ కొన్నింంటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కుక్క, పిల్లి,..

Viral Video: సోకులు మామూలుగా లేవుగా.. అచ్చం మనిషిలా రెండు కాళ్లపై నడుస్తూ.. వీడియో వైరల్
Sheep Walking Video
Ganesh Mudavath

|

Aug 10, 2022 | 11:26 AM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు డంప్ అవుతుంటాయి. ప్రపంచంలో అనేక సంఖ్యలో జంతువులున్నప్పటికీ కొన్నింంటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కుక్క, పిల్లి, గుర్రం వంటి జంతువులు చేసే స్టంట్స్ ను చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యంగా కనిపిస్తాయి. సాధారణంగా జంతువులు నాలుగు కాళ్లతో నడుస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓ గొర్రె మాత్రం అచ్చం మనిషిలా రెండు కాళ్లతో నడుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోలో గొర్రె.. మనుషుల్లా రెండు కాళ్లతో హాయిగా నడుస్తూ కనిపిస్తుంది. ముందరి రెండు కాళ్లను పైకి లేపి, వెనుక కాళ్లతో నడుచుకుంటూ వెళ్లడాన్ని చూడవచ్చు. నాలుగు కాళ్ల జంతువులు ఇలా రెండు కాళ్లతో నడవడం చాలా అరుదుగా కనిపిస్తుంది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 11 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 1 లక్షా 32 వేలకు పైగా వీక్షించగా, 5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు. అంతే కాదు ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ‘మేక తాగిందా’ అని, ‘రాత్రిపూట ఈ మేకను చూస్తే ఏమవుతుందో ఆలోచించు’ అని మరో యూజర్ సరదా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu