Sheep Sentenced: గొర్రెకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష.. నేరం ఏంటో తెలిస్తే షాకవుతారు..

సూడాన్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ఒక గొర్రె మహిళపై దాడి చేసింది. ఓ 45 ఏళ్ల మహిళను ఈ గొర్రె చంపింది. ఇక్కడి కోర్టు గొర్రెలకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతే కాదు..

Sheep Sentenced: గొర్రెకు మూడేళ్ల కఠిన జైలు శిక్ష.. నేరం ఏంటో తెలిస్తే షాకవుతారు..
Sheep Sentenced
Follow us

|

Updated on: May 24, 2022 | 6:43 PM

గొర్రెకు జైలు శిక్ష(Sheep Sentenced) పడింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన సూడాన్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ఒక గొర్రె మహిళపై దాడి చేసింది. ఓ 45 ఏళ్ల మహిళను ఈ గొర్రె చంపింది. ఇక్కడి కోర్టు గొర్రెలకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతే కాదు ఈ ఘటనకు సంబంధించి గొర్రెల యజమానిని కోర్టు దోషిగా తేల్చనప్పటికీ.. అతనికి భారీ ఫైన్ వేసింది. గొర్రె దాడిలో మరణించిన మహిళ కుటుంబానికి 5 ఆవులను అందించాలని ఆదేశించింది. అలాగే శిక్ష పూర్తయిన తర్వాత ఆ కుటుంబానికి ఈ గొర్రెను కూడా పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ గొర్రెను ఈ నెల ప్రారంభంలో దక్షిణ సూడాన్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదియు చాపింగ్ అనే 45 ఏళ్ల మహిళపై గొర్రె తన కొమ్ములతో దాడి చేసింది. ఏకకాలంలో పలుసార్లు దాడి చేయడంతో ఆ మహిళ పక్కటెముకలు విరిగిపోయాయి. కొన్ని చోట్ల అంతర్గత గాయాల కారణంగా చికిత్స పొందుతూ ఆ మహిళ మరణించింది.

యజమాని అమాయకుడు, గొర్రెలు మహిళను చంపాయి కాబట్టి దానిని అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసులు. పోలీసుల కథనం ప్రకారం.. రుంబెక్ ఈస్ట్‌లోని అకుల్ యోల్ అనే స్థలంలో ఈ సంఘటన జరిగింది. ఘటన అనంతరం గొర్రెను అదుపులోకి తీసుకుని మాలెంగే అగోక్ పాయెం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. గొర్రెల యజమాని నిర్దోషి అని పోలీసు అధికారి మేజర్ ఎలిజా మెబర్ తేల్చారు. ఈ ఘటనకు పాల్పడిన గొర్రెను అదుపులోకి నిర్భందించారు. అయితే శిక్ష పడిన ఈ గొర్రెను మూడేళ్లపాటు మిలటరీ క్యాంపులో బంధించాల్సి ఉంటుందని షీప్‌కు కోర్టు శిక్ష విధించింది. దీని తరువాత, దాని యజమాని దానిని బాధితుడి కుటుంబానికి పరిహారంగా అందించాలని ఆదేశించింది కోర్టు.

బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు..

ఇవి కూడా చదవండి

అయితే కోర్టు తన నిర్ణయంలో బాధిత కుటుంబానికి ఐదు ఆవులను నష్టపరిహారంగా త్వరగా ఇవ్వాలని ఆదేశించింది. నిజానికి, బాధితురాలి కుటుంబం, గొర్రెల యజమాని దుయోని మాన్యాంగ్ ధాల్ ఇద్దరూ ఇరుగుపొరుగువారు. కోర్టు నిర్ణయానికి ఇద్దరూ అంగీకరించి ఒప్పందంపై సంతకాలు చేశారు.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!