Viral: రాంగ్ అడ్రస్‌కి ఫుడ్ ఆర్డర్ పెట్టిన తనయుడు.. తండ్రి ఇచ్చిన రిప్లైకి కొడుకు మైండ్ బ్లాంక్.. మదర్ రియాక్షన్

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఫ్యామిలీ చాట్ స్క్రీన్‌షాట్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో స్పందిస్తున్నాడు. కొడుకు తప్పుడు అడ్రస్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఫ్యామిలీ వాట్‌అప్ గ్రూప్‌లో జరిగిన చాటింగ్ ఇప్పుడు నవ్వులు పూయిస్తుంది.

Viral: రాంగ్ అడ్రస్‌కి ఫుడ్ ఆర్డర్ పెట్టిన తనయుడు.. తండ్రి ఇచ్చిన రిప్లైకి కొడుకు మైండ్ బ్లాంక్.. మదర్ రియాక్షన్
Funny Chat
Follow us

|

Updated on: Jul 07, 2022 | 8:48 AM

Trending: ప్యామిలీ, ఫ్రెండ్స్, క్లాస్ మేట్స్, కొలిగ్స్, అపార్ట్‌మెంట్ మెంబర్స్.. ఎవరైనా సరే ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని.. ఎప్పటికప్పుడు అందులోనే చాట్ చేసుకుంటున్నారు. ఈ గ్రూప్స్ ద్వారా ఒక విషయాన్ని ఎక్కువ మందికి ఒకేసారి చెప్పే వీలుంటుంది. ఇంక ఫ్రెండ్స్ అయితే అదే పనిగా గ్రూప్స్‌లో యాక్టివ్‌గా ఉండి కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. తాజాగా ఓ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో కొడుక్కి.. తండ్రి అదిరిపోయేలా రిప్లై ఇచ్చాడు. అది చూస్తే మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం. జితు అనే ట్విటర్ యూజర్.. రాంగ్ అడ్రస్‌తో ఫుడ్ ఆర్డర్ చేయడం పట్ల అతని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యిందో అతను ఓ స్క్రీన్‌షాట్‌ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. అతను ఇంట్లోవారి కోసం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ(Swiggy)లో  రోస్టెడ్ చికెన్‌ను ఆర్డర్ పెట్టాడు. కానీ హడావిడిలో రాంగ్ అడ్రస్ యాడ్ చేశాడు. ఈ విషయం గమనించిన వెంటనే..ఫుడ్ డెలివరీ కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్‌ను అప్రోచ్ అయ్యాడు. పొరపాటు జరిగిందని తన ఆర్డర్ క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరాడు. వారు కూడా అతని కన్సర్న్ అర్థం చేసుకుని.. ఆర్డర్ క్యాన్సిల్ చేసి.. మనీ వెనక్కి పంపారు. ఇక్కడివరకు అంతా బానే ఉంది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో పంచుకోగా, వారు నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి అతనికి ఫ్యూజులు ఔటైపోయాయి.

స్క్రీన్‌షాట్‌ను గమనిస్తే… జితు తన పేరెంట్స్‌కు విషయాన్ని వివరించాడు. రాంగ్ అడ్రస్‌తో ఫుడ్ ఆర్డర్ చేశాను. అయినప్పటికీ ఆర్డర్ క్యాన్సిల్ చేసి మనీ వాపస్ పొందాను(“స్విగ్గీ సే వాపసు మిల్ గయా, గలాత్ జగహ్ ఆర్డర్ హో గయా థా వో” ) అని పేర్కొన్నాడు. ఆ టెక్స్ట్‌కి జితు తండ్రి పన్నీ వేలో రిప్లై ఇచ్చాడు. నువ్వు కూడా పొరపాటున ఆర్డర్ చేయబడ్డావు, కానీ వాపస్ పొందే సౌలభ్యం నాకు లేదు కదా? ( “తూ భీ గల్తీ సే ఆర్డర్ హుయా థా, లేకిన్ ముఝే తోహ్ రీఫండ్ నహీ మిలా?”) అని పంచ్ ఇచ్చాడు ఫాదర్. ఈ ఫన్నీ చాట్‌లోకి జితూ మదర్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నవ్వుతున్న ఈమోజీలను పెట్టింది. కాగా ఈ ఫన్నీ చాట్ స్క్రీన్‌షాట్‌ని తీసిన జితు నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. “రోస్టెడ్ చికెన్ తినాలనుకున్నాను, కానీ బదులుగా నేనే రోస్ట్ అయ్యాడు” అనే క్యాప్షన్‌ పెట్టాడు. ప్రజంట్ ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..