Missing Cat: పెంపుడు పిల్లి తప్పిపోయిందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. పట్టి ఇస్తే భారీ నజరానా.. ఎక్కడంటే..

Missing Cat:చాలామంది పెంపుడు జంతువులను తమ సొంత ఇంటి పిల్లలా భావిస్తారు. వాటిని ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. ఫ్యామిలీ సభ్యుల(Family Members)తో సమానంగా వాటిని ఎంతో కేరింగ్ గా..

Missing Cat: పెంపుడు పిల్లి తప్పిపోయిందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. పట్టి ఇస్తే భారీ నజరానా.. ఎక్కడంటే..
Cat Missing
Follow us

|

Updated on: Jan 24, 2022 | 3:52 PM

Missing Cat:చాలామంది పెంపుడు జంతువులను తమ సొంత ఇంటి పిల్లలా భావిస్తారు. వాటిని ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. ఫ్యామిలీ సభ్యుల(Family Members)తో సమానంగా వాటిని ఎంతో కేరింగ్ గా చూసుకుంటారు. పుట్టిన రోజులు, శ్రీమంతం వంటి వేడుకలను కూడా వాటికి జరిగిపించి తమ సంతోషాన్ని పందిమందికి తెలియజేస్తారు. వాటిని చిన్నగా జ్వరం వస్తే.. పెంపకందారులు అల్లాడి పోతారు. అలాంటిది అది తప్పిపోతే ఇంకేమైనా ఉందా.. గల్లీ.. గల్లీ చుట్టేస్తారు. అంతా వెతికేస్తారు. దాని కోసం వెతుకుతుంటారు. అయితే ఓ వ్యక్తీ తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి తప్పిపోయింది(catmissing).. గల్లీ గల్లీ తిరిగేస్తున్నాడు. నాలుగు రోజులు దాటినా తన పెంపుడు పిల్లి దొరకలేకని ఏకంగా పిల్లి తెచ్చి ఇస్తే.. బహుమతిని కూడా ప్రకటించాడు. తప్పిపోయిన తన పర్షియన్ పిల్లిని తిరిగి ఇస్తే.. రూ.35 వేల రివార్డ్ ఇస్తానని ప్రకటించాడో యజమాని. ఈ ఘటన కర్ణాటకలో(Karnataka) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…

బెంగళూరులోని మాస్బా షరీఫ్ అనే వ్యక్తి జయా నగర్​లోని రాజన్న లేఅవుట్​లో నివసిస్తున్నాడు. షరీఫ్ ఇంట్లో ఓ పర్షియన్ ఆడ పిల్లి పిల్ల ఓ కుందేలు ఉంది. ఆ పిల్లికి అలిజీ అని పేరు పెట్టుకుని గత మూడేళ్ళుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. తన ఫ్యామిలీగా ఆ అలిజీని భావిస్తాడు. అయితే ఈ అలిజీ జనవరి 15వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో షరీఫ్ పిల్లిని చుట్టుపక్కల తెలిసిన ప్రాంతాల్లో వెదికాడు. ఎక్కడా కనిపించలేదు. దీంతో తన పిల్లి తప్పిపోయింది అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాడు.

అలిజీ ఎవరికైనా కనిపిస్తే దాని జాడను తెలపాలని ఓ ప్రకటనను కూడా విడుదల చేశాడు. తనకు తన పిల్లిని తెచ్చి ఇచ్చినా ఎక్కడ ఉందో చెప్పినా వారికి బహుమతిగా రూ.35 వేలను ఇస్తానని ప్రకటించాడు. ఇంట్లో అలిజీ, కుందేలు ఆడుకున్న వీడియోలను షరీఫ్ షేర్ చేసి.. అందరికీ అది పిల్లి.. నాకు మాత్రం నా ఫ్యామిలీ మెంబర్ ఎక్కడ ఉన్నా తెచ్చి అలిజీని తెచ్చి ఇవ్వండి అని వేడుకుంటున్నాడు.

Also Read:

సల్మాన్‌ను మొదటిసారి కలిసినప్పుడు ఏం అడిగానంటే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రగ్యా జైస్వాల్..