Viral Video: సాధారణంగా చిన్న పిల్లలు పెద్దలను అనుకరిస్తారనే విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు పెద్దలు ఏం చేస్తే పిల్లలు అది చేస్తుంటారు. చూడటానికి ఈ సీన్ బలే ఫన్నీగా ఉంటుంది. అయితే, మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుందనడంలో ఎలాంటి సందేహం. చిన్న పిల్లలు మనుషులైనా.. జంతువులైనా రెండు జాతుల మనస్తత్వాలూ ఒకటే. తాజాగా ఓ కుక్క పిల్లకు సంబంధించిన క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ ఇంట్లో కుందేలు, కుక్క పిల్ల ఉన్నాయి. బ్లాక్ కలర్ కుందేలు ముందుగా గెంతుతూ నడుస్తుండగా.. దాని వెనుకాలే నెమ్మదిగా వెళ్లింది కుక్క పిల్ల. కుందేలును తన కాళ్ల నెట్టింది కుక్క పిల్లి. దాంతో భయపడిపోయిన కుందేలు.. ఆ కుక్క పిల్లపై తిరగబడింది. ఆ వెంటనే తన దారిన తాను గెంతుతూ ముందుకు సాగింది కుందేలు. అయితే, కుందేలు గెంతడాన్ని నిశితంగా మనించిన కుక్క పిల్ల.. తాను కూడా కుందేలు అనుకుందో ఏమో గానీ.. అచ్చం కుందేలు మాదిరిగా గెంతడం ప్రారంభించింది. క్యూట్ క్యూట్‌గా కుందేలుగా గెంతుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ వీడియోకు ఫిదా అయిపోతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ బ్యూటిఫుల్ వీడియోను మీరూ చూసేయండి.
Puppy thinks he’s a bunny.. 😅 pic.twitter.com/7sIs2zGfWq
— Buitengebieden (@buitengebieden) June 30, 2022
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..