Eye Test: భయ్యా.. గుడ్లగూబ మీకు కనిపించిందా..? కనిపెట్టమని సవాల్ విసురుతుంది

ఈ ఫోటోలో ఓ గుడ్లగూబ నక్కి ఉంది.. తాను ఎక్కడున్నానో చెప్పమని సవాల్ విసరుతుంది.. మీరు దాని ఆచూకి కనిపెట్టగలరా..?

Eye Test: భయ్యా.. గుడ్లగూబ మీకు కనిపించిందా..? కనిపెట్టమని సవాల్ విసురుతుంది
Find The Owl
Follow us

|

Updated on: Feb 06, 2023 | 3:52 PM

మీరు ఫేస్ బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ వంటివి వినియోగిస్తున్నారా..? అయితే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు తారసపడే ఉంటాయ్. ఇవి ఇప్పుడు నెటిజన్లను మస్త్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు మాయాజాలం చేస్తాయ్ ఈ పజిల్స్. మెదడుకు కూసింత మేత వేసేందుకు, మన ఐ పవర్ ఏ రేంజ్‌లో ఉందో తెల్సుకునేందుకు ఇవి యూజ్ అవుతాయ్. ఈ ఫోటోలో పాముని కనిపెట్టండి.. ఈ చిత్రంలో తప్పుగా ఉన్న అక్షరం ఏంటి..  ఫోటోలో ఉన్న నంబర్ ఏంటి..? వంటి పజిల్స్ అనమాట. ఇలాంటి పజిల్స్ తో అంత ఈజీ కాదండోయ్. సరదా తీర్చేస్తాయ్. ఇంత సమయంలో కనిపెట్టాలి అని కండీషన్ లేకపోతే.. ప్రశాంతంగా వెతికి వాటి ఆచూకి పట్టొచ్చు. కానీ టైమ్‌ లిమిట్ పెట్టడంలోనే అసలు తిరకాసు ఉంది. హడావిడిలో, హైరానాలో బొక్కబోర్లా పడతారు చాలామంది. తెలిసి.. తెలిసి.. తప్పులో కాలేస్తారు. అలాంటి ఓ క్రేజీ పజిల్‌ను మీ ముందుకు తెచ్చాం.

పైన ఉన్న ఫోటోను జాగ్రత్తగా గమనించండి. ఓ చెట్టును బాగా ఫోకస్ చేశారు. అక్కడ ఓ గుడ్లగూబ కూడా నక్కి ఉంది. ఆ చెట్టు బెరడు రంగులో అది కలిసిపోయకింది. దాన్ని కేవలం 15 సెకన్లో మీరు గుర్తించాలి. డెడ్ ఈజీ పజిల్.. అందుకే అంత తక్కువ సమయం. బాగా ఫోకస్ పెట్టి చూడండి ఈజీగానే దాన్ని పట్టేయవచ్చు.

ఆ ఇస్మార్ట్ గుడ్లగూబ చాలామంది పట్టేసే ఉంటారు. దాన్ని కనుగొనలేని వారు ఉంటే ఓ దిగులు పడకండి. ఆన్సర్ ఉన్న ఫోటోను మేము కింద ఇచ్చేస్తాం. ఇంకోసారి ఇలాంటి పజిల్ ఇచ్చినప్పుడు మాత్రం హైరానా పడకుండా.. వెతకండి. విజయం మిమ్మల్ని కూడా వరిస్తుంది.

Owl

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..