నీళ్లు తాగుతున్న నల్లటిపామును డిస్టర్బ్‌ చేస్తే ఊరుకుంటుందా..? ఒక్కసారిగా షేక్‌ చేసేసిందిగా..

నీళ్లు తాగుతున్న నల్లటిపామును డిస్టర్బ్‌ చేస్తే ఊరుకుంటుందా..? ఒక్కసారిగా షేక్‌ చేసేసిందిగా..
Snake

పాములు చాలా ప్రమాదకరమైనవి.. ఒక్క కాటు వేస్తే చాలు ప్రాణం ఇట్టే పోతుంది. అందుకే చాలా మందికి పాములంటే భయం. తాజాగా పాముకు సంబంధించిన ఓ వీడియో

Jyothi Gadda

|

May 24, 2022 | 8:29 PM

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో చాలా షాకింగ్‌ వీడియోలు కూడా ఉంటాయి. అదే సమయంలో పాములకు సంబంధించిన వీడియోలను కూడా నెటిజన్లు షాక్‌ అయ్యేలా చేస్తుంటాయి. పాములు చాలా ప్రమాదకరమైనవి.. ఒక్క కాటు వేస్తే చాలు ప్రాణం ఇట్టే పోతుంది. అందుకే చాలా మందికి పాములంటే భయం. తాజాగా పాముకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వీడియోలో ఓ వ్యక్తితో అతి సన్నిహితంగా ఉండటం మనం చూడొచ్చు..ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం…

సాధారణంగా పాములకు పాలంటే ఇష్టమని చెబుతుంటారు.. పాము ఎక్కువగా పాలుతాగుతాయనే వార్తలు కూడా మనం వింటుంటాం..కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇందుకు భిన్నమైన సీన్‌ కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి చేతిలో నీళ్ల గ్లాస్ పట్టుకుని ఓ పాముకు దాహం తీరుస్తున్నట్టుగా కనిపించింది. వీడియోలో కనిపిస్తున్న కారు నలుపు రంగులో ఉంది. పాము దాని రంగు చూస్తే చాలా భయానకంగా కనిపిస్తుంది. అదే సమయంలో గ్లాసులో ఉంచిన నీటిని ఆ పాము హాయిగా తాగుతోంది. ఆ టైమ్‌లో అతడు ఆ పాముకు అతి దగ్గరగా రావటంతో…ఒక్కసారి ఆ పాము గ్లాస్‌లోంచి తలను బయటకు పెట్టింది..దాంతో అతడు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డాడు..

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు. బాబోయ్‌ పాము ఎంత ఝలక్‌ ఇచ్చిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మనోడు ఘటికుడే..అంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu