Viral Video: అందమైన ముద్దుగుమ్మను ముద్దాడిన చిలుక.. తర్వాత చిలుక చెప్పిన మాటకు యువతి షాక్..

చిలుక పలుకులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఎందుకంటే దాని మాటలు చాలా అందంగా.. తీయగా.. మైమరిపించేలా ఉంటాయి. దాని ముందు మీరు..

Viral Video: అందమైన ముద్దుగుమ్మను ముద్దాడిన చిలుక.. తర్వాత చిలుక చెప్పిన మాటకు యువతి షాక్..
Parrot Kissed The Woman
Follow us

|

Updated on: Apr 14, 2022 | 12:41 PM

చిలుక పలుకులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఎందుకంటే దాని మాటలు చాలా అందంగా.. తీయగా.. మైమరిపించేలా ఉంటాయి. దాని ముందు పదే పదే పదే పదే పదే పదే పదే పదే పదే చెబితే వెంటనే కంఠస్థం చేస్తేంది ఈ చిలుక. సోషల్ మీడియాలో మీరు చిలుకలకు సంబంధించిన అనేక వీడియోలను చూసి ఉంటారు. ఇటీవల, ఒక చిలుక ఐఫోన్ రింగ్‌టోన్‌ను ఖచ్చితమైన ధ్వనిని చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Viral Video) సందడి చేసిన సంగతి తెలిసిందే.  ఈ వీడియో చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. నిజానికి, ఈ వీడియోలో ఒక చిలుక తనను పెంచుకుంటున్న ఆవిడను ముద్దుపెట్టుకున్న తర్వాత ఆమెకు ‘థ్యాంక్యూ బేబీ’ అని చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. అంతే కాదు ఈ వీడియోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ తన పెంపుడు చిలుకను తన పేరుతో పిలుస్తున్నట్లు మీరు చూడవచ్చు.

అది విని రెయిలింగ్ మీద కూర్చున్న చిలుక వచ్చి ఆ మహిళ భుజం మీద కూర్చుంది. దీని తర్వాత ఆ చిలుక  చేస్తున్న పని చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు. తనను పెంచుకుంటున్న అమ్మడును ముద్దాడుతూ కృతజ్ఞతలు తెలపడం.. అది “థ్యాంక్స్ బేబీ” అంటూ చెప్పడం.. అదిరిపోతుంది. అది చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఊహించవచ్చు. కాబట్టి ముందుగా ఈ వీడియో చూద్దాం.

ముద్దుగుమ్మను ముద్దాడుతూ చిలుక ఏం చెప్పిందో వీడియోలో చూడండి

View this post on Instagram

A post shared by UNILAD (@unilad)

ముద్దు.. ముద్దు మాటలు చెప్పే చిలుక వీడియో సోషల్ మీడియాతో సందడి చేయడంతోపాటు.. ఇన్‌స్టాగ్రామ్‌లో unilad అనే ఖాతాతో షేర్ చేయబడింది. ‘నాకు కూడా అలాంటి చిలుక కావాలి’ అనే క్యాప్షన్‌తో ఓ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఒకరోజు క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు 41 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో చాలా మంది దీనిపై తమ స్వంత స్పందనను తెలపుతున్నారు.

ఇవి కూడా చదవండి: Watch Video: వీహెచ్ కారు అద్దాలు ధ్వంసం చేసింది ఇతనే.. సీసీటీవీలో రికార్డ్ ..

Bandi Sanjay: ఇవాళ్టి నుంచి ప్రజా సంగ్రామం.. అలంపూర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర..