పార్లమెంటులో… ఎంపీ బిడ్డకు పాలుపట్టిన స్పీకర్!

ఆయన దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి. అయితే, ఆయన ఏనాడూ అధికార దర్పం ప్రదర్శించలేదు. ఉన్నత స్థానంలో ఉన్నా.. సాధారణ పౌరుడిలాగానే వ్యవహరిస్తూ అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన మరెవ్వరో కాదు.. న్యూజిలాండ్ పార్లమెంట్ స్పీకర్ ట్రెవర్ మలార్డ్. తాజాగా ఆయన ఓ బిడ్డకు పాలు పట్టిస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎంపీ టామాటి కఫే బుధవారం తన నెలల బిడ్డతో పార్లమెంటుకు హజరయ్యారు. సభ సాగుతుండగా ఆ చిన్నారి ఆకలితో ఏడ్వడాన్ని స్పీకర్ చూశారు. […]

పార్లమెంటులో... ఎంపీ బిడ్డకు పాలుపట్టిన స్పీకర్!
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 10:06 AM

ఆయన దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి. అయితే, ఆయన ఏనాడూ అధికార దర్పం ప్రదర్శించలేదు. ఉన్నత స్థానంలో ఉన్నా.. సాధారణ పౌరుడిలాగానే వ్యవహరిస్తూ అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన మరెవ్వరో కాదు.. న్యూజిలాండ్ పార్లమెంట్ స్పీకర్ ట్రెవర్ మలార్డ్. తాజాగా ఆయన ఓ బిడ్డకు పాలు పట్టిస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

ఎంపీ టామాటి కఫే బుధవారం తన నెలల బిడ్డతో పార్లమెంటుకు హజరయ్యారు. సభ సాగుతుండగా ఆ చిన్నారి ఆకలితో ఏడ్వడాన్ని స్పీకర్ చూశారు. దీంతో ఆ బిడ్డను తన దగ్గరకు తీసుకున్నారు. స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టుకుని బాటిల్‌తో పాలు పట్టారు. ఈ ఫొటోలను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.

‘‘సాధారణంగా సభా బాధ్యతలు కలిగిన అధికారులు మాత్రమే స్పీకర్ స్థానంలో కూర్చుంటారు. అయితే.. ఈ రోజు ఓ ముఖ్యమైన వ్యక్తి (వీఐపీ) నాతో ఈ స్థానంలో కూర్చున్నారు. మీ కుటుంబంలో కొత్త సభ్యుడు చేరినందుకు శుభాకాంక్షలు టిమ్’’ అని ట్వీట్ చేశారు. ఈ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. స్పీకర్ ఆ బిడ్డకు పాలు పట్టించి, లాలించడం చూసి నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు