ఇన్‌స్ట్రాగ్రమ్ యూజర్లకు శుభవార్త… అందుబాటులోకి సరికొత్త ఫీచర్..

ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు శుభవార్త. ఇన్‌స్టా వినియోగదారులకు అనుకూలంగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇన్‌స్ట్రాగ్రమ్ యూజర్లకు శుభవార్త... అందుబాటులోకి సరికొత్త ఫీచర్..

Instagram : ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు శుభవార్త. ఇన్‌స్టా వినియోగదారులకు అనుకూలంగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఫోటో షేరింగ్‌, చాటింగ్ యాప్‌గానే ఉన్న ఇన్‌స్టా ఇప్పుడు సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. యూజర్లు లైవ్ చాట్ చేసుకునేందుకు వీలుగా ‘లైవ్ రూమ్స్’‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్లు ఒకేసారి ముగ్గురు అతిథులతో లైవ్ చాట్ చేసుకోవచ్చునని ఇన్‌స్టాగ్రమ్ యాజమాన్యం తెలిపింది. కరోనా వ్యాప్తి వలన ప్రజల మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో తమ లైవ్ ఫీచర్ అందరనీ దగ్గర చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, దీన్ని తొలుత భారత్‌లోనే పరీక్షించిన ఇన్‌స్టా.. ఇక్కడే అమల్లోకి తీసుకురావడం విశేషం. భారత్‌లోని పలువురు కంటెంట్ క్రియేటర్ల ఖాతాలో లైవ్ రూమ్స్‌ను పరిశీలించామని, అది సక్సెస్ అయ్యిందని ఇన్‌స్టా యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు.. త్వరలోనే ఇతర దేశాల్లోనే ఈ ఆప్షన్‌ను తీసుకువస్తామని ఇన్‌స్టా తెలిపింది.

Click on your DTH Provider to Add TV9 Telugu