గతంలో ఎన్నో వివాదాలతో పాటు వార్తల్లో నిలిచిన ఫాస్ట్ మూవీంగ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘నెస్లే ఇండియా’ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు ఆ కంపెనీని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ కంపెనీకి సంబంధించిన కిట్ క్యాట్ చాక్లెట్ రేపర్లపై జగన్నాథ స్వామితో పాటు బాలభద్ర, సుభద్ర మాతా చిత్రాలుండడమే ఈ వివాదానికి కారణం. మతపరమైన అంశం కావడంతో చాలామంది ఈ చాక్లెట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాక్లెట్లు తిన్నాక చెత్త కుండీలు, డస్ట్ బిన్లలో రేపర్లను పడేస్తారని తద్వారా వాటిపై ఉన్న దేవుడి చిత్రాలు అపవిత్రమవుతాయన్నదే వాళ్ల అభ్యంతరం. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అందుకు చింతిస్తున్నాం..
కాగా ఈ చాక్లెట్ రేపర్లపై ఉన్న బొమ్మలను వెంటనే తీసేయాలని చాలామంది సోషల్ మీడియా వేదికగా నెస్లే కంపెనీకి అభ్యర్థనలు పంపారు. దీంతో ఆ కంపెనీ దిగొచ్చింది. వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ‘ ఒడిశా సంప్రదాయన్ని ఇతర ప్రాంతాలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలా రేపర్లపై జగన్నాథుడి చిత్రాలను ముద్రించాం. ఆర్ట్‌ను, ఆర్టిస్టులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశాం. ఇదెంత సున్నితమైన అంశమో మేం అర్థం చేసుకోగలం. ఎవరి మనోభావాలైనా దెబ్బతీయాలని మేం అనుకోవడం లేదు.. ఒకవేళ మా ప్రకటనలతో ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే అందుకు మేం చింతిస్తున్నాం. క్షమా పణలు చెబుతున్నాం’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివాదం తలెత్తుతుందని నెస్లే ఇండియా ముందే ఊహించిందేమో . ముందస్తు చర్యగా గత ఏడాది నుంచే మార్కెట్లోని ఈ చాక్లెట్ ప్యాక్ లను ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.
గతంలోనూ
ఇదిలా ఉంటే నెస్లే ఇండియాకు ఇలాంటి వివాదాలేం కొత్త కాదు. గతేడాది ఏప్రిల్‌లో మణిపూర్‌లో ఉన్న కెయిబుల్ లాంజావో నేషనల్ పార్క్‌ను.. మేఘాలయాలో ఉన్నట్లు రేపర్ మీద ప్రచురించి చాలామందితో తిట్లు తింది. ఆపై తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పింది.
Please remove the Lord Jagannath, Balabhadra and Mata Subhadra Photos In Your @kitkat Chocolate Cover . When People Are Finished The Chocolate They Are Through The Cover On Road, Drain, Dustbin, Etc . So Please Remove The Photos . @Nestle @NestleIndiaCare #Odisha#JayJagannath pic.twitter.com/jJNwSNEs9e
— BARSHA PRIYADARSHINI NAYAK (@i_am_barsha_) January 18, 2022
Also Read: Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..
Viral Photos: ఐదువేల బడ్జెట్లో ఇండియాలోని ఈ అందమైన ప్రదేశాలను చూడవచ్చు.. ఎలాగంటే..?