Mysterious Fish: ఇదో వింత.. కాళ్ల సాయంతో మంచులో నిలబడిన చేప.. షాకింగ్ వీడియో వైరల్

సర్వ సాధారణంగా చేపలు నీటిలో మొప్పల సాయంతో ఈదుతాయి. ఊపిరిని పీల్చుకుంటాయి. అయితే అందుకు భిన్నమైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. చేప 'పాదాల' మీద హాయిగా నిలబడి ఉంది.

Mysterious Fish: ఇదో వింత.. కాళ్ల సాయంతో మంచులో నిలబడిన చేప.. షాకింగ్ వీడియో వైరల్
Mysterious Fish
Follow us

|

Updated on: Dec 03, 2022 | 1:04 PM

ఈ ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలున్నాయి. కొన్ని సార్లు ప్రకృతిలోని వింతలను చూస్తే మన కళ్ళను మనమే నమ్మలేం.  ఒకొక్కసారి ఈ ప్రపంచంలో ఇలాంటివి ప్రపంచంలో నిజంగా ఉన్నాయా అని కూడా ఆలోచిస్తాం. అలాంటి అనేక వింత జీవులు భూమి మీద, సముద్రంలో ఉన్నట్లు తరచుగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సముద్రపు లోతుల్లో మనుషులు ఇంతకు ముందెన్నడూ చూడని వింతలు తరచూ కనిపిస్తుంటాయి. అందుకే సముద్రం లోతు, మనిషి మనసు ఎవ్వరికీ తెలియదని.. ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయని అంటారు. వస్తావం చెప్పాలంటే.. మీరు వివిధ రకాల చేపలను చూసి ఉంటారు. అయితే మీరెప్పుడైనా ‘పాదాలపై’ నిలబడి ఉన్న చేపని చూసారా ? అదేంటి చేపలకు మొప్పలు కూడా ఉండేవి.. కాళ్ళు ఎక్కడ ఉంటాయని ఆలోచిస్తున్నారా.. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి.. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.

వైరల్ వీడియోలో మంచు మీద ‘పాదాల’ మీద నిలబడి ఉన్న ఒక పెద్ద చేప కనిపిస్తుంది. సర్వ సాధారణంగా చేపలు నీటిలో మొప్పల సాయంతో ఈదుతాయి. ఊపిరిని పీల్చుకుంటాయి. అయితే అందుకు భిన్నమైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. చేప ‘పాదాల’ మీద హాయిగా నిలబడి ఉంది. ఇది చేప లేక మరేదైనా వింత సముద్ర జీవా అనేది ఎవరికీ తెలియదు.. కానీ చూడడానికి చేపలా అనిపిస్తుంది. చేపలకు కాళ్లు ఉండవు.. వైరల్ వీడియోలో ఉన్న చేపకు కాళ్లు ఉన్నాయి. చేపకు పాదాలు ఎలా పెరిగాయనేది అంతుచిక్కని రహస్యం. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. మీరెప్పుడైనా చేప కాళ్లను చూశారా? ఖచ్చితంగా చూసి ఉండరు ఇప్పటి వరకూ..

ఇవి కూడా చదవండి

కాళ్లున్న చేప

ఈ ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @OTerrifying అనే IDతో షేర్ చేశారు. క్యాప్షన్‌ ‘ఇదో వింత చేప.. మంచుపై నిలబడి ఉన్న చేప’ జత చేశారు. కేవలం 14 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు  77 లక్షల వ్యూస్, 2 లక్షల 42 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది. అదే సమయంలో, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది దేవుని సృష్టి.. దేవుడి చేపని అంటే.. మరొకొందరు అసలు ఇది ఏ జీవి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..