కుక్క.. తోడేలు కుటుంబానికి చెందిన ఒక జాతి అని మీకు తెలుసా. అయితే.. తోడేళ్ళు చాలా ప్రమాదకరమైనది.. ణాంతకం అయినది.. అదే కుక్కలు మాత్రం విశ్వాసానికి ప్రతీక.. గ్రామ సింహాల కంటే పెంపుడు కుక్కల సంగతి వేరుగా ఉటుంది. ఇవి చాలా ప్రేమగా ప్రవర్తిస్తాయి.. ప్రజలతో ఆడుకుంటాయి.. ముఖ్యంగా మనం చిన్న కుక్కల గురించి మాట్లాడినట్లయితే.. అవి చాలా అందమైనవి, ఇందులో చాలా సరదాగా ఉంటాయి. ఈ రోజుల్లో అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో కొన్ని చిన్న కుక్క పిల్లలు తమ ‘తల్లి’తో ఆడుకోవడం కనిపిస్తుంది. ప్రజలు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు.
చిన్నతనంలో మీరు కూడా మీ తల్లిదండ్రులతో చాలా ఆడుకుని ఉంటారు. అసలే మనం చిన్నతనంలో పిల్లల్ని కనడం ద్వారా పిల్లలతో సరదాగా గడపడం తల్లిదండ్రుల బాధ్యత. తద్వారా పిల్లలు కూడా ఆడుకుని ఆనందిస్తారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అలాంటి దృశ్యమే కనిపిస్తోంది. మంచు కురుస్తున్న ప్రదేశంలో కొన్ని కుక్క పిల్లలు తమ ‘తల్లి’తో ఎలా సరదాగా ఆడుకోవడం మనం చూడవచ్చు. అచ్చుగుద్దినట్లుగా ‘అమ్మ’ ఎలా చెబితే అవి అలా ఆడుకోవడం మనం గమనించవచ్చు. బుజ్జి కుక్కలతో గెంతుతూ ఆడుకుంటున్న తల్లి.. పిల్లల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Life is all about loving and being loved. pic.twitter.com/1t9uzqPv67
— Dipanshu Kabra (@ipskabra) January 1, 2022
ఈ ఫన్నీ వీడియోను ఐపిఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్లో పంచుకున్నారు. ‘లైఫ్ అంటే ప్రేమించడం.. ప్రేమను పంచడం’ అనే క్యాప్షన్‌ను ఈ వీడియోకు జోడించారు. దీపాంశు కబ్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా సోషల్ మీడియాలో అలాంటి వీడియోలను షేర్ చేస్తుంటారు. వీటిని ప్రజలు కూడా చాలా ఇష్టపడతారు.
ఈ 14 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 7 వేలకు పైగా వీక్షించగా.. వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయంలో వీడియోను చూసి చాలా మంది కామెంట్లు కూడా చేశారు. ఒక యూజర్ ఇలా కామెంట్ చేశాడు. ‘ప్యార్ లో ప్యార్ దో’ అని వ్యాఖ్యానించగా.. మరొక నెటిజనం కుక్క పిల్లల గురించి ‘వెరీ క్యూట్’ అని రాశారు.
ఇవి కూడా చదవండి: Early Election: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రచ్చ.. ముందస్తు ప్రచారంపై అధికార పక్షాల ఫైర్..