Viral Video: కేక్ కోసం తల్లితో బుడ్డోడి డీల్.. ముద్దులొలికే మాటలతో మెస్మరైజ్ చేసేశాడు.. బ్యూటీఫుల్ వీడియో మీకోసం..

Viral Video: గతంలో అలెక్సాను దమ్ దమ్ డిగ్గా డిగ్గా అని ఆడమని ఆడుగుతూ నెట్టింట్లో వైరలై.. నెటిజన్ల మనసు గెలుచుకున్న చిన్నారి కబీర్ సూద్ గుర్తున్నాడా?.

Viral Video: కేక్ కోసం తల్లితో బుడ్డోడి డీల్.. ముద్దులొలికే మాటలతో మెస్మరైజ్ చేసేశాడు.. బ్యూటీఫుల్ వీడియో మీకోసం..
Child Video

Viral Video: గతంలో అలెక్సాను దమ్ దమ్ డిగ్గా డిగ్గా అని ఆడమని ఆడుగుతూ నెట్టింట్లో వైరలై.. నెటిజన్ల మనసు గెలుచుకున్న చిన్నారి కబీర్ సూద్ గుర్తున్నాడా?. ఆ కబీర్ తన ముద్దు ముద్దు మాటలతో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఆ చిన్నారి ముద్దులొలికే మాటలు చూసి నెటిజన్ల ‘హౌ క్యూట్ బేబీ’ అంటూ తెగ ముద్దు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన చిన్నారి వీడియో ఇప్పడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ బుడ్డోడు ఏం అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వీడియోలో.. తల్లి ఆరాధ్య చిన్నారి కబీర్‌ను ఎత్తుకుని ఆటాడిస్తుంటుంది. ఇంతలో రోటీ సబ్జీ తింటావా? దాల్ చావల్ తింటావా? అని కబీర్‌ను అడుగుతుంది. దానికి వెంటనే స్పందించిన చిన్నారి కబీర్.. ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. తన చిట్టిపొట్టి పలుకులతో.. ‘‘నో… నో థ్యాంక్యూ.. రోటీ సబ్జీ, దాల్ చావల్ వద్దు కానీ, కేక్ పీస్ తింటాను.’’ అని చెబుతాడు. తింటావా? అని మరోసారి అడగ్గా.. మళ్లీ నో అంటూ బదులిచ్చాడు. కేక్ మాత్రమే తింటానని అన్నాడు. అంతేనా అని తల్లి అడిగితే.. అంతే అంటూ ఆమెతో ఆ బుల్లి కబీర్ డీల్ చేసుకున్నాడు. వాడి అందమైన రియాక్షన్‌కి వెంటనే ఆ తల్లి నవ్వుతుంది. కాగా, ఈ బుడ్డోని క్యూట్ మాటలకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. అదికాస్తా తెగ వైరల్ అవుతోంది. ముద్దు ముద్దు మాటలతో మంత్రముగ్దులను చేస్తున్నాడు చిన్నారి కబీర్. ‘నో థ్యాంక్యూ’ అంటూ అతను చెప్పిన పదానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘నో థ్యాంక్యూ’ ఇక నుంచి నా ఫేవరేట్ పదం అని ఓ సోషల్ మీడియా యూజర్ పేర్కొన్నారు. చాలా స్వీట్‌గా మాట్లాడుతున్నాడు అంటూ మరికొందరు నెటిజన్లు ఇలా రకరకాలుగా స్పందిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ముద్దులొలికే చిన్నారి మాటలను మీరూ వినండి..

Viral Video:

 

View this post on Instagram

 

A post shared by Kabir Sood (@tintinkabacha)

Also read:

SA vs WI T20 World Cup 2021: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?

Ganja: రానున్న రోజుల్లో ఏపీలో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు: డీజీపీ గౌతమ్ సవాంగ్

Siddipet Collector: చెండాడుతా.. వెంటాడుతా.. అధికారులకు సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చిన సిద్దిపేట కలెక్టర్.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu