‘బొజ్జ’నే అతడి ప్రాణాలను కాపాడింది

బొజ్జ కాస్త పెరిగితే చాలు.. చాలా మంది తెగ ఫీల్‌ అయిపోతుంటారు. దాన్ని తగ్గించుకోవడం కోసం డైటింగ్‌లు చేయడం, ఎక్సర్‌సైజ్‌లు చేయడం అలా చేస్తుంటారు.

  • Tv9 Telugu
  • Publish Date - 6:15 pm, Thu, 13 August 20
'బొజ్జ'నే అతడి ప్రాణాలను కాపాడింది

Man Belly saves his life: బొజ్జ కాస్త పెరిగితే చాలు.. చాలా మంది తెగ ఫీల్‌ అయిపోతుంటారు. దాన్ని తగ్గించుకోవడం కోసం డైటింగ్‌లు చేయడం, ఎక్సర్‌సైజ్‌లు చేయడం అలా చేస్తుంటారు. నిజానికి చెప్పాలంటే బొజ్జ ఎక్కువ పెరగడం కూడా ఆరోగ్యానికి శుభసూచికం కాదు. కానీ ఓ వ్యక్తి బొజ్జ మాత్రం అతడి ప్రాణాలను కాపాడింది. అదేంటి.. బొజ్జ ఏంటి, ప్రాణాలను కాపాడటమేంటని అనుకుంటున్నారా..! అయితే మొత్తం వార్తను చదివేయండి.

చైనా హెనాన్ ప్రాంతంలోని లోవ్‌యంగ్‌లో లియు(28) అనే ఓ వ్యక్తి ఇటీవల తన ఇంటి ప్రాంగణంలో ఉన్న ఓ చిన్నపాటి బావిలో పడిపోయాడు. కాస్త సన్నగా ఉన్న వాళ్లు అయితే అలానే అందులో కొట్టుకుపోయేవారు. కానీ లియుకి అతడి బొజ్జ అడ్డు వచ్చింది. లియు కడుపు ఎక్కువగా ఉండటంతో పాటు మధ్యలో ఇరుక్కుపోయాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులకు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో అక్కడకు చేరుకున్న రెస్క్యూ సిబ్బంది కష్టపడి అందులో నుంచి లియును బయటకు తీశారు. వారు తీసేవరకు అతడు సహనంతో ఎదురుచూశాడు. గత వారం ఈ ఘటన జరగ్గా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More:

కీర్తి ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. ‘గుడ్‌లక్ సఖి’ టీజర్‌ రెడీ

స్వర్ణా ప్యాలెస్‌‌ అగ్ని ప్రమాదం: వెలుగులోకి రమేష్ ఆసుపత్రి అక్రమాలు