Viral: 20 ఏళ్లపాటు ఈ ప్లేట్‌లోనే అన్నం తిన్న అమ్మ.. ఆమె మరణం తర్వాత తెలిసిన అసలు విషయం..

అమ్మ ప్రేమకు కొలమానం అంటూ ఉంటుందా..? పిల్లలు ఎంత ఎదిగినా సరే.. ఆమెకు మాత్రం ప్రేమ తగ్గదు.. మారదు. అమ్మకు ఫోన్ చేసి.. రోజూ కనీసం ఓ 10 నిమిషాలు అయినా మాట్లాడండి. అందరికీ ఆ అదృష్టం ఉండదు.

Viral: 20 ఏళ్లపాటు ఈ ప్లేట్‌లోనే అన్నం తిన్న అమ్మ.. ఆమె మరణం తర్వాత తెలిసిన అసలు విషయం..
Mother's Love
Follow us

|

Updated on: Jan 21, 2023 | 3:37 PM

మనం పరిగెడుతూ పడిపోతే అమ్మకే మొదట నొప్పి పుడుతుంది. మనకంటే ముందే మన ఆకలి తనకి తెలిసిపోతుంది. అమ్మ గురించి ఏమని చెబుతాం. అమ్మకు అమ్మై పుడితే తప్ప అమ్మ రుణం తీర్చుకోలేం. అమ్మ గొప్పదనం తెలిపే ఓ ఘటన తాజాగా నెట్టింట వైరల్ అవుతుంది. మన తల్లితండ్రులు కొన్నేళ్లుగా కొన్ని అలవాట్లను అనుసరిస్తూ ఉంటారు. మనం కాస్త పెద్ద అయ్యి వాటిని మార్చుకోమన్నా.. వారు అందుకు నిరాకరిస్తూ ఉంటారు. అలాంటి అలవాట్ల వెనుక కారణాల గురించి మనం పెద్దగా పట్టించుకోం. వారు అలా చేయడం వెనుక ఏదో ఒక కనెక్షన్ అయితే ఉంటుంది. తాజాగా విక్రమ్ ఎస్ బుద్ధనేసన్ అనే వ్యక్తి.. తన తల్లి మరణించిన తర్వాత ఆమె చనిపోయే వరకు రెండు దశాబ్దాలకు పైగా ఒకే ప్లేట్‌ను ఎందుకు ఉపయోగించారనే విషయాన్ని తెలుసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. అందుకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

“ఇది అమ్మ ప్లేట్.. తను గత 2 దశాబ్దాలుగా తను ఇందులోనే అన్నం తినేది.. ఇది చిన్న ప్లేట్.. అప్పుడప్పుడు నేను, చుల్బులి (శృతి, నా మేనకోడలు) మాత్రమే ఇందులో తినడానికి అనుమతించింది. ఆమె మరణం తర్వాత నాకు నా సోదరి ద్వారా అసలు విషయం తెలిసింది. ఆ ప్లేట్ నేను చిన్నతనంలో గెలుచకున్న బహుమతి అని. నా 7వ తరగతిలో… అంటే 1999వ సంవత్సరంలో గెలుచుకున్నది. ఈ 24 ఏళ్లు ఆమె నేను గెలిచి ఇంటికి తీసుకొచ్చిన ఈ ప్లేట్‌లో అన్నం తిన్నది. ఎంత గొప్ప విషయం. ఎందుకో కానీ ఈ విషయం అమ్మ నాకు చెప్పలేదు. మా..మిస్ యూ మా” అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు విక్రమ్ ఎస్ బుద్ధనేసన్.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు భావోద్వేగంతో స్పందిస్తున్నారు. తల్లి ప్రేమకు సమానమైనది ఏదీ లేదని ఓ యూజర్ పేర్కొన్నాడు. హద్దుల్లేనిది అమ్మ ప్రేమ అని మరొకరు రాసుకొచ్చారు. ఈ కథనం మీ హృదయాన్ని కూడా కదిలించింది కదూ!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.