షార్క్ పొట్టలో వెడ్డింగ్ రింగ్.. రహస్యం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎడిన్‌బర్గ్‌కు చెందిన సివిల్‌ సర్వెంట్‌ రిచర్డ్‌ మార్టిన్‌ టర్నర్‌(44) తన భార్య 40వ పుట్టినరోజును గొప్పగా నిర్వహించాలనుకున్నాడు. ఇందుకోసం విలాసవంతమైన ట్రిప్‌ను ప్లాన్‌ చేశాడు. హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్‌కు చెందిన రీయూనియన్‌ ద్వీపాన్ని ఎంచుకున్నాడు. అగ్నిపర్వతాలు, పగడపు దిబ్బలు, అందమైన బీచ్‌లు రీయూనియన్‌ ప్రత్యేకతలు. టర్నర్‌ ఈ నెల 2వ తేదీన రీయూనియన్‌ ద్వీపానికి భార్యతో కలిసి వెళ్లాడు. అక్కడ సముద్రంలో సరదాగా ఈతకు వెళ్లిన అతడు కనిపించకుండా పోయాడు. కాగా ఫ్రెంచ్‌ అధికారులు ఇటీవలే నాలుగు […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:46 pm, Fri, 8 November 19
షార్క్ పొట్టలో వెడ్డింగ్ రింగ్.. రహస్యం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎడిన్‌బర్గ్‌కు చెందిన సివిల్‌ సర్వెంట్‌ రిచర్డ్‌ మార్టిన్‌ టర్నర్‌(44) తన భార్య 40వ పుట్టినరోజును గొప్పగా నిర్వహించాలనుకున్నాడు. ఇందుకోసం విలాసవంతమైన ట్రిప్‌ను ప్లాన్‌ చేశాడు. హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్‌కు చెందిన రీయూనియన్‌ ద్వీపాన్ని ఎంచుకున్నాడు. అగ్నిపర్వతాలు, పగడపు దిబ్బలు, అందమైన బీచ్‌లు రీయూనియన్‌ ప్రత్యేకతలు. టర్నర్‌ ఈ నెల 2వ తేదీన రీయూనియన్‌ ద్వీపానికి భార్యతో కలిసి వెళ్లాడు. అక్కడ సముద్రంలో సరదాగా ఈతకు వెళ్లిన అతడు కనిపించకుండా పోయాడు. కాగా ఫ్రెంచ్‌ అధికారులు ఇటీవలే నాలుగు టైగర్‌ షార్క్‌ చేపలను ఆ జలాల్లో పట్టుకున్నారు. 13 ఫీట్ల పొడవున్న ఓ టైగర్‌ షార్క్‌ చేప కడుపులో ఓ వ్యక్తి చేయి కనిపించింది. ఆ చేతికి ఉన్న ఉంగరం ద్వారా భార్య అతడిని టర్నర్‌గా గుర్తించింది. డీఎన్‌ఏ రిపోర్ట్‌ సైతం ఇదే అంశాన్ని నిర్ధారించింది. మిగతా మూడు సొర చేపలను పరిశీలించాల్సి ఉంది. టర్నర్‌ ఈతకు వెళ్లిన ప్రదేశం సురక్షితమైనదిగా ఈతగాళ్లు పేర్కొంటున్నారు. ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.