Bike Stunt: ముందుచక్రం గాలిలోకి లేపి మరీ బైక్ నడిపాడు.. కట్ చేస్తే .. ఏమైందో మీరే చూడండి..

Bike Stunt:  ముందుచక్రం గాలిలోకి లేపి మరీ బైక్ నడిపాడు.. కట్ చేస్తే .. ఏమైందో మీరే చూడండి..

viral video : పేపర్ ఓపెన్ చేసినా టీవీ ఆన్ చేసినా ఎక్కువగా కనిపిస్తున్న వార్తలు యాక్సిడెంట్స్. నిత్యం ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి..ప్రజలు ప్రాణాలు కోల్పోతుం ఉన్నారు...

Rajeev Rayala

|

Aug 20, 2021 | 5:42 PM

Bike Stunts: పేపర్ ఓపెన్ చేసినా టీవీ ఆన్ చేసినా ఎక్కువగా కనిపిస్తున్న వార్తలు యాక్సిడెంట్స్. నిత్యం ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి..ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అనుకోకుండా జరిగే దాన్ని ప్రమాదం అంటారు.. కానీ కొందరు మాత్రం ఏరికోరి ప్రమాదాలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. ఇష్టమొచ్చినట్టు బైక్ నడుపుతూ ఇతరుల ప్రాణాలమీదకు తీసుకువస్తుంటారు. ప్రతి ఒక్కరు తమ వద్ద కాస్ట్లీ బైక్ ఉండాలని, అత్యంత వేగంగా వెళ్లే బైక్ కొనాలని కలలు కంటుంటారు. అలాంటి బైకులు ఉన్న కొంతమంది ఆకతాయిలు బైకుల పై విన్యాసాలు చేస్తూ ఎక్కడో ఒక చోట మనకు తారస పడుతుంటారు. వాళ్ళు చేసే కొన్ని విన్యాసాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కానీ.. పొరపాటున పట్టు జారిందో ఇక అంతే. ఇక్కడ ఈ వ్యక్తి కూడా అలాంటి సాహసమే చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు.

కొంతమంది బైక్ నడుపుతున్నప్పుడు ఒళ్ళు జల్లుమంటుంది. విచిత్రమైన విన్యాసాలు చేస్తూ.. అడ్డదిడ్డంగా నడుపుతూ ఉంటారు. అయితే బైక్ ముందు చక్రాన్ని గాలిలోకి లేపి నడుపుతూ కొందరు హల్ చల్ చేస్తుంటారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి కూడా బైక్‌ను ఇలా గాలిలోకి నడపడానికి ప్రయత్నించాడు. ముందు కాస్త బాగానే నడిపినా.. ఆతర్వాత తడబడ్డాడు చివరకు రోడ్డు మీద పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బైక్ నడుపుతున్న వ్యక్తి అదుపుతప్పి కిందపడగా అతడి బైక్ మాత్రం కొంత దూరం అలానే వెళ్ళింది. ఈ తతంగాన్ని వీడియో తీసుతున్న మరో వ్యక్తి వేగంగా వెళ్లి బైక్‌ను ఆపే ప్రయత్నం చేశాడు. చివరకు ఆ బైక్ వేగం తగ్గి కింద పడిపోయింది. ఈ వీడియో పై నెటిజన్లు రాకరకాల కామెంట్లు పెడుతున్నారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అని కొందరంటుంటే.. మరి కొందరు మనకెందుకురా బుజ్జి..! అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aakaasam Nee Haddhu Ra : సూర్య సినిమాకు అవార్డుల పంట.. మారో ఘనత సాధించిన ఆకాశం నీ హద్దురా..

Virushka: లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న విరుష్క జంట.. రెస్టారెంట్‌లో సందడి చేసిన స్టార్ కపుల్. ఫొటోలు వైరల్‌.

Actor Nani: మరోసారి జెర్సీ కాంబో రిపీట్ కానుందా.. నానితో సినిమా ప్లాన్ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu